తెలంగాణ(Telangana) ఎలక్షన్స్(Elections) దగ్గర పడుతున్న వేల పార్టీల్లో హడావిడి పెరిగింది. సీఎం కేసీఆర్(CM KCR) ఆల్మోస్ట్ అన్నిచోట్లా తమ అభ్యర్థుల్ని ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్(Congress) అభర్ధులని ఆహ్వానించగా వచ్చిన దరఖాస్తులని పరిశీలన చేస్తుంది. బీజేపీ(BJP) మాత్రం ఇంకా అభ్యర్థుల గురించి మాట్లాడట్లేదు.
ఇటీవలే అమిత్ షా(Amit Shah) ఖమ్మం(Khammam) సభకు వచ్చి ఎన్నికల శంఖారావం పూరించి వెళ్లారు. దీంతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. తాజాగా నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) మీడియాతో మాట్లాడారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే 119 స్థానాల్లో పోటీచేస్తుంది. రాజాసింగ్ విషయంలో కేంద్రపార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిటీ వేస్తాం, మీటింగ్ తర్వాత అభర్ధులపై నిర్ణయం తీసుకుంటాం. అభ్యర్థుల ప్రకటన త్వరలోనే చేస్తాం. నేడు మోదీ రాఖీ కానుకగా సిలెండర్ పై 200 తగ్గించడం సంతోషకరమైన విషయం. సెప్టెంబర్ లో విమోచన దినోత్సవం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతాం. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తాం. మాది క్యాడర్ బేస్డ్ పార్టీ. బీఆర్ఎస్ కుటుంబ పార్టీలాగా డైనింగ్ టేబుల్ పై అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించలేం. క్యాడర్ తో మాట్లాడిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని అన్నారు. దీంతో సెప్టెంబర్ తర్వాతే అభర్ధులని బీజేపీ ప్రకటిస్తుందని తెలుస్తుంది.