Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కింది – కిషన్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ పార్టీ ప్రొటెమ్‌ స్పీకర్‌గా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ని ఎంపిక చేసింది. ఈరోజు ఉదయం ఆయన గవర్నర్ తమిళి సై సమక్షంలో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసారు

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 12:00 PM IST

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కిందని .. ఎప్పుడైనా సీనియర్ వ్యక్తులను ప్రొటెమ్ స్పీకర్‌ (Telangana Protem Speaker)గా నియమించడం ఆనవాయితీగా వస్తోందని ..కానీ, MIM తో కుట్ర పన్ని కాంగ్రెస్ సంప్రదాయాలను పాటించడలేదని అసహనం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ తమ ఎమ్మెల్యేలంతా ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో కొద్దీ సేపటి క్రితం (డిసెంబర్ 09) ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రొటెమ్‌ స్పీకర్‌గా ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ని ఎంపిక చేసింది. ఈరోజు ఉదయం ఆయన గవర్నర్ తమిళి సై సమక్షంలో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంది. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తొలుత కిషన్ రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సన్మానించారు. అనంతరం భాగ్యలక్ష్మీ అమ్మవారిని బీజేపీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు.

Read Also : Auto Drivers : తెలంగాణ కాంగ్రెస్ కు మొదటి షాక్ తగలబోతుందా..?