Kidnap : ప‌ట్ట‌ప‌గ‌లు యువ‌తి కిడ్నాప్!హైద‌రాబాద్ పోలీస్ కు ఛాలెంజ్‌!

సైబ‌రాబాద్ న‌డిబొడ్డున ఓ యువ‌తిని సినిమా స్టైల్ లో కిడ్నాప్చే సిన యువ‌కుడి నిర్వాకం

  • Written By:
  • Updated On - December 9, 2022 / 05:19 PM IST

సైబ‌రాబాద్ న‌డిబొడ్డున ఓ యువ‌తిని సినిమా స్టైల్ లో కిడ్నాప్చే (Kidnap) సిన యువ‌కుడి నిర్వాకం పోలీసుల‌కు (Police) ఛాలెంజ్ విసురుతోంది. ఏ మాత్రం భ‌యం లేకుండా ప‌ట్ట‌ప‌గ‌లు సుమారు 100 మంది యువ‌కుల‌తో వెళ్లి ఇంట్లో ఉన్న యువ‌తిని కిడ్నాప్ (Kidnap) చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్ లోని యువ‌తుల భ‌ద్ర‌త‌ను ప్ర‌శ్నించేలా ఈ సంఘ‌ట‌న క‌నిపిస్తోంది. ఈ సంఘ‌ట‌న‌పై పోలీసులు(Police) పూర్తి వివ‌రాల‌ను రాబ‌ట్టలేని ప‌రిస్థితిలో ఉన్నారు. ప్ర‌త్యేక బృందాల‌తో కిడ్నాప్ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేస్తున్నారు. యువ‌తిని కిడ్నాప్ చేసిన యువ‌కుడు న‌వీన్ రెడ్డి గా పోలీసులు (Police) నిర్థారించుకున్నారు. అయితే, ఆ యువ‌తిని కిడ్నాప్ చేసి ఎక్క‌డికి తీసుకెళ్లాడు? అనేది ఇంకా తెలియ‌డంలేదు. కుటుంబీకులు ఆందోళ‌న చెందుతున్నారు.

రంగా రెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న యువ‌తుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.తూర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నేగుడలోని సిరిటౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ కు గురైన యువ‌తి పేరెంట్స్ ఆదిభ‌ట్ల పోలీసు స్టేష‌న్లో (Police Station) ఫిర్యాదు చేశారు. వాళ్ల ఫిర్యాదు మేర‌కు కుమార్తెన్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మంది వచ్చి కిడ్నాప్ చేశాడు. యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారు ధ్వంసం అయ్యాయి. దుండగులను అడ్డుకోబోయిన పక్కింటి వ్యక్తులకు, యువ‌తి పేరెంట్స్ కు గాయాలు అయ్యాయి. ఇంటో ఉన్న‌ సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు తొలుత ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నార‌. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు చెప్పారు.

పోలీసుల సపోర్ట్ తోనే నవీన్ రెడ్డి మనుషులు రెచ్చిపోయారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డి కొంతమంది మనుషులతో తమ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న సమయంలో పోలీసులకు, 100కు కాల్ చేసినా స్పందించలేదని ఆవేద‌న చెందుతున్నారు. యువతిని తీసుకెళ్లిన యువకుడు నవీన్ రెడ్డి `మిస్టర్ టీ టైం` ఓనర్ గా తెలుస్తోంది. ఇటీవ‌ల న‌వీన్ రెడ్డి ఆగ‌డాల‌పై దిభ‌ట్ల పోలీస్ స్టేష‌న్లో యువ‌తి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అయిన‌ప్ప‌టికీ సీరియ‌స్ గా స్పందించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఇలాంటి సంఘ‌ట‌న నెల‌కొంద‌ని ఆరోపిస్తున్నారు. బాధితురాలి ఇంటిపై దండ‌గులు దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం వైరల్ గా మారింది. తొలుత పెళ్లి సంబంధం కోసం వ‌చ్చిన న‌వీన్ రెడ్డి ఆ త‌రువాత వేధిస్తున్నాడ‌ని యువ‌తి త‌ల్లి ఆరోపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక పోలీసు (Police) బ‌ల‌గాలు న‌వీన్ రెడ్డి అండ్ టీమ్ కోసం అన్వేషిస్తున్నారు. కిడ్నాప్ జ‌రిగిన స‌మ‌యంలో షూట్ చేసిన వీడియో (Video)ల‌ను అధ్య‌య‌నం చేస్తున్నారు. వాటి ఆధారంగా కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల‌కు (Police) ఈ కేసు ఒక ఛాలెంజ్ గా మారింది.

Also Read:  Sharmila : షర్మిల దీక్షకు భగ్నం. పోలీసుల అదుపులో షర్మిల..!