ఖమ్మం (Khammam )లో మున్నేరు (Munnar ) వాగు శాంతిచిందని సంతోషపడాలో..బురద మిగిల్చిందని బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో బాధితులు ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 36 అడుగుల మేర ఖమ్మం వద్ద ఉగ్రరూపం దాల్చిన మున్నేరు వాగు నిన్నటి సాయంత్రం నుండి శాంతిస్తూ వచ్చింది. శుక్రవారం నుండి శనివారం వరకు కురిసిన భారీ వర్షానికి మున్నేరు వాగు పోటెత్తింది. దీంతో ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, పోలేపల్లి, గొల్లపాడు, తీర్థాల, పెద్ద తండాలలో ప్రజలు ఇళ్లలోకి నీరు చేరింది. అలాగే నగరంలోని పలు కాలనీ లు సైతం నీట మునిగాయి. ఇప్పుడు వరద ఉదృతి తగ్గడం తో ఇళ్లకు చేరుకున్నారు. తీరా తమ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న సమస్తం నానిపాడైపోయాయి. విలువైన టీవీ, కూలర్, ఫ్రీజ్, ల్యాప్టాప్ తదితర వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయని, ఇంటి ముందు పార్క్ చేసిన బైక్స్ , కార్లు కొట్టుకపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నిత్యావసరాలు సైతం బురదమయం అయ్యాయని, వీధుల్లో బురద, ఇంట్లో బురద దీన్ని ఎలా పోగోట్టుకోవాలో తెలియని పరిస్థితి వచ్చిందంటూ బాధితులు వాపోతున్నారు. బురదమయంగా మారిన కాలనీలలో త్వరితగతిన ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె..నిన్న (సోమవారం) సీఎం రేవంత్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణ, ఆస్తి నష్టానికి ఆర్థిక సాయం ప్రకటించారు. పాడిపశువులు, గొర్రెలు, మేకలు నష్టపోయిన వారికి ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. వరదల్లో ధ్రువపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లీ ఒరిజినల్స్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. నష్టం అంచనా నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం ప్రకటించారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ధైర్యం చెడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి హామీ ఇచ్చారు. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆస్తి, పంటనష్టం సాయం అందించాలని అధికారులను ఆదేశించాం. అత్యవసర నిధిగా కలెక్టర్ ఖాతాలో రూ. 5 కోట్లు కేటాయించాం. మీకు రాబోయే ఉపద్రవాన్ని ప్రభుత్వం ముందుగానే ఊహించింది’ అంటూ వారికి భరోసా ఇచ్చారు.
Read Also : Pawan Kalyan : అందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు – పవన్ క్లారిటీ