Site icon HashtagU Telugu

Telangana Govt : ఖబర్దార్ రేవంత్..చూసుకుందాం – నిరుద్యోగుల హెచ్చరిక

Khabardar Rewant

Khabardar Rewant

తెలంగాణ (Telangana) రాష్ట్రం మరోసారి సమ్మెలు , ఆందోళనలు , ధర్నాలతో దద్దరిల్లుతుంది. మాయమాటలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాలపై నిన్న (జులై 08) రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరసన బాటపట్టారు. పింఛన్లు పెంపు చేయాలంటూ బీడీకార్మికులు, దివ్యాంగులు , డీఎస్సీ వాయిదావేయాలని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులు, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు ఇలా అనేక మంది ఆందోళన బాట పట్టారు. వీరికి మద్దతుగా బీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్వీ, సీపీఎం, సీఐటీయూ తదితర నాయకులు రోడ్లపైకి రావడం తో ఇంకాస్త ఉదృతం అయ్యింది.

ముఖ్యంగా నిరుద్యోగులు గత 15 రోజులుగా నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. పోస్టులు పెంచి మెగా డీఎస్సీ వేయాలని, ప్రస్తుత డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని , టెట్‌కు, డీఎస్సీకి పొంతన లేని సిలబస్‌ ఉండడంతో ప్రిపరేషన్‌కు సమయం సరిపోవడం లేదని వారంతా ఆందోళన చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా DSC తేదీని ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న రాత్రి అంతా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ , మంత్రులు పట్టించుకున్న పాపన పోలేదు. ఇదే తీరు కేసీఆర్ వ్యవహరిస్తే ఓడించి ఫామ్ హౌస్ లో కుర్చోపెట్టామని..అలాంటిది మీరు మాకు పెద్ద లెక్క కాదంటూ నిరుద్యోగ సంఘాలు, విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల సమయంలో బస్సు యాత్రలు చేసి ఊరూరు తిరిగి నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని అవ్వా తాతల కాళ్ళు మొక్కి ఓట్లు వేయించాము , కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చేస్తున్నది ఏమీ లేదని , ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవని చెప్పి మహిళలను అర్ధరాత్రి రోడ్డు మీదకు ఈడ్చారని డీఎస్సీ మహిళా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక చూసుకో..రేవంత్ రెడ్డి అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం దిగి వస్తుందో లేదో చూడాలి.

ఇక్కడ ప్రభుత్వం మరో వాదన వినిపిస్తుంది. ఆందోలన బాట పట్టిందంతా బిఆర్ఎస్ వల్లే అని..అసలైన నిరుద్యోగులు , DSC అభ్యర్థులు అందులో లేనేలేరని అంటుంది. మరి కాంగ్రెస్ నేతలు చెప్పేందట్లో ఇంత నిజం నుండో తెలియాలి. ఏది ఏమైనప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ కు కాస్త వ్యతిరేకత వస్తున్న మాట మాత్రం నిజం.

Read Also : TDP Office Attack Case : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్ ఇచ్చిన హైకోర్టు