Phone Tapping Case : మాజీ డీఎస్‌పీ ప్రణీత్ రావు కీలక నిందితుడిగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు వ్యవహారంలో మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు ఏకకాలంలో 10 చోట్ల రైడ్స్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఐ న్యూస్ ఛానెల్ ఎండీ శ్రవణ్ రావు ఇంట్లో శుక్రవారం రాత్రే సుమారు 3 గంటల పాటు పోలీసులు సోదాలు నిర్వహించారని సమాచారం. శ్రవణ్ ఇంటి నుంచి రెండు ల్యాప్ టాప్‌లు, 4 ట్యాబ్‌లు, 5 పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ రావు , రాధా కిషన్ రావు, శ్రవణ్ రావు ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. కస్టడీ గడువు ముగియడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత రావును పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. తన కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టేసింది.
Also Read :YSRCP Slogan : ‘జగన్ చెప్పిందే చేస్తాడు.. చేయలేనిది చెప్పడు’.. ఇదే వైసీపీ ఎన్నికల నినాదం
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఇటీవల హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి తీర్పు వెలువరించారు.