ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెల(Gaddar Daughter Vennela)కు రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ (Telangana cultural chief ) గా ఆమెను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు డాక్టర్ వెన్నెలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరి వెల్లడించారు. ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔనత్యాన్ని ఇనుమడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారధిని ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తొలుత దీనికి రసమయి బాలకిషన్ ను ఛైర్మన్ గా నియమించారు. ఆ తర్వాత ఇదే పదవిలో ఆయనను కొనసాగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం తో సాంస్కృతిక సారధిని నియమించాల్సి వచ్చింది. ఇక వెన్నెల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.ఈ ఉప ఎన్నికలో వెన్నెలకు కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వలేదు. బీజేపీ నుంచి పార్టీలో చేరిన శ్రీగణేష్ కు కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించింది.
వెన్నెల వ్యక్తిగతం విషయానికి వస్తే..
గద్దర్, విమల దంపతులకు వెన్నెల జన్మించారు. వెన్నెలకు సూర్యం అనే సోదరుడు ఉన్నాడు. వెన్నెలకు ఇద్దరు పిల్లలు సంతానం. ఉస్మానియా యూనివర్సిటీలో వెన్నెల గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. వెన్నెల సికింద్రాబాద్‌లోని అల్వాల్ పరిసరాల్లో తన తండ్రి ప్రారంభించిన మహాబోధి విద్యాలయ అనే పాఠశాలను నడుపుతోంది. ఆమె 18 సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తూ, గత 10 సంవత్సరాలుగా పేద పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో పేరుగాంచిన ఈ పాఠశాలను వెన్నెల నడుపుతుంది. వెన్నెల తన తండ్రి గద్దర్ మరణం తర్వాత 2023లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన వెన్నెల తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దగ్గరనుంచి ఆమే ప్రత్యేక్ష రాజకీయల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె, తన స్కూల్ బాధ్యతలను చూసుకుంటుంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆమెను రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ నియమించడం తో అందరు అభినందిస్తున్నారు.
Read Also : Air India express : తెలుగు రాష్ట్రాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్