Site icon HashtagU Telugu

YSRTP: వైఎస్సార్టీపీకి కీలక నేతలు రాజీనామా, షర్మిల గో బ్యాక్ ఆంధ్ర అంటూ నినాదాలు

Sharmila Decision

Sharmila Decision

YSRTP: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీ కి కీలక నేతలు రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. షర్మిల రాజశేఖర్ రెడ్డి పేరును చెడగొట్టారని, కాంగ్రెస్ లో నిలబడతా అని చివరగా అందరిని రోడ్డు మీద నిలబెట్టిందని ఆయన మండిపడ్డారు.

ఇన్ని రోజులకు షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని ఆయన అన్నారు. మేమంతా షర్మిలను తెలంగాణ నుండి బహిష్కరిస్తున్నామని తెలంగాణ ప్రజలంటే షర్మిలకు చిన్నచూపుఅని షర్మిల రాజకీయాలకు పనికిరాదు. భవిష్యత్ కార్యచరణ త్వరలోనే చెబుతాం ఆయన పేర్కొన్నారు.

అనంతరం సత్యవతి మాట్లాడారు. ‘‘వైఎస్సార్ అభిమానులను షర్మిల మోసం చేసింది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము అంటే పార్టీలో చేరాను పాదయాత్రలో పాల్గొన్నాను. వైఎస్సార్ కార్యకర్తలు అందరూ అభిమానంతో పార్టీలో చేరారు అందరిని మోసం చేసింది షర్మిల. తెలంగాణ నుండి షర్మిలను బహిష్కరిస్తున్నం. షర్మిల ఎవర్ని గౌరవించలేదు సొంత ఎజెండా తో ముందుకు వెళ్ళింది. పాదాల మీద కాదు మా అందరి శవాల మీద నడిచేందుకు సిద్ధమైంది. రాబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడ పొటి చేసిన ఓడగొడుతాం’’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నాయక్, బి సంజీవ రావు పాల్గొన్నారు.

Also Read: Kriti Sanon: నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే!

Exit mobile version