తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Panchayat Elections)పై రేపు జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశముంది. పంచాయతీ ఎన్నికలతో పాటు జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల విషయాల్లో ఏటివాటిని ముందుగా నిర్వహించాలనే అంశంపై స్పష్టత రావొచ్చని సమాచారం. గత కొన్ని రోజులుగా ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం వర్గాల్లో చర్చలు సాగుతున్న నేపథ్యంలో రేపటి సమావేశం (Cabinet Meeting) కీలకం కానుంది.
Surya Namaskar : ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?
అధికార వర్గాల సమాచారం మేరకు.. రేపటి నిర్ణయం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే వారంలో ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే పలు జిల్లాల నుండి పాఠశాలల వాడకం, బూత్ లిస్టులు తదితర అంశాలపై నివేదికలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలన్నీ ఎన్నికల నిర్వహణ దిశగా వేగంగా సాగుతున్న సంకేతాలుగా భావిస్తున్నారు.
ఎన్నికల అంశంతో పాటు రేపటి క్యాబినెట్ భేటీలో బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రాజీవ్ యువ వికాసం పథకం, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలపై కూడా చర్చించనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటైన తర్వాత ఇవే తొలి కీలక నిర్ణయాలుగా భావిస్తున్నారు. అన్ని వర్గాల దృష్టి రేపటి మంత్రివర్గ సమావేశంపై ఉండగా, అధికారిక ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.