Site icon HashtagU Telugu

Telangana CM : సీఎం రేవంతా ? కాదా ? తేలేది నేడే

Revanth Dharani

Revanth Dharani

Telangana CM : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఫైనల్ చేస్తారా ?  మరెవరికైనా ఛాన్స్ ఇస్తారా ? అనే దానిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ తెలంగాణ సీఎంగా ఎవరు ఉండాలనేది ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. పార్టీ హైకమాండ్ సైతం రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపుతోందని.. సోమవారం రాత్రికల్లా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ తీరా కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సీనియారిటీ, ఇతరత్ర అంశాలు ప్రాతిపదికగా మంగళవారం రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తుందనే టాక్ తెరపైకి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం సాయంత్రమే హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ నుంచి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లిపోయారు. ఆయన వెంట మరో నలుగురు అబ్జర్వర్లు కూడా హస్తినకు వెళ్లారు. ఇవాళ వీరందరితో చర్చించిన అనంతరం కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ.. తెలంగాణ  సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు కూడా తమకు ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ గెలుపు కోసం విరామం లేకుండా శ్రమించిన రేవంత్ వైపు హైకమాండ్ నిలుస్తుందా ? సీనియారిటీకి మాత్రమే పెద్దపీట వేస్తుందా ? అనేది ఇవాళ రాత్రికల్లా తేలిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ రేసులో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి(Telangana CM) ప్రమాణం చేస్తారా.. లాస్ట్ మినిట్‌లో అనూహ్యంగా మరొకరు తెరపైకి వస్తారా అనేది వేచి చూడాలి.

Also Read: Telangana : తెలంగాణ‌లో కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలో క్రిమిన‌ల్ కేసులు ఉన్నావారే ఎక్కువ‌

Exit mobile version