GHMC: హైదరాబాద్‌లో సోమవారం హైడ్రా రంగనాథ్, జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబరితి కలిసి అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణ చర్యలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని హైడ్రా, జీహెచ్‌ఎంసీ కలిసి నిర్ణయం తీసుకున్నాయి.
Read Also: Fact Check : సునితా విలియమ్స్ అంతరిక్షంలో ఖురాన్ చదివారా ?
అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, వర్షాకాలంలో వరద ముంపు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో మరో కమిటీ వేయాలని కమిషనర్లు నిర్ణయించారు. ఈ రెండు కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.
అంతేకాక.. పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద ముప్పును తగ్గించేందుకు నదీ కాలువల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులు సూచించారు. వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, ముఖ్యమైన రహదారుల మరమ్మతులు, రహదారి గుంతల పూడింపు, ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ లాంటి చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సమస్యలు తలెత్తే ముందు వాటిని అరికట్టేందుకు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం నగరంలోని వాణిజ్య భవనాలు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, మార్కెట్లను గుర్తించి, అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కల్పించే ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను అమలు చేయాలని నిర్ణయించారు.
Read Also: Tihar jail : తిహార్ జైలు మరో ప్రాంతానికి తరలింపు..!