Telangana Higher Education: తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Higher Education) నందు గురువారం T-SATతో ఉన్నత విద్యలో భావితరాల వారికి విలువైన విద్యను అందించేందుకు గాను తెలంగాణ ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం అధ్యాపకులకు, విద్యార్థులకు అధునాతనమైన సబ్జెక్టులపై నైపుణ్యం పెంచే వివిధ ట్రైనింగ్ ప్రొగ్రామ్స్, చర్చలు, ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో బోధన చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విద్య ప్రమాణాలను మెరుగుపరచేందుకు గాను ఉన్నత విద్యా మండలి.. T-SAT కలసి విద్యార్థుల కొరకు సర్టిఫికేట్ కోర్సు, డిప్లోమా కోర్సు, స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించేందుకు గాను తెలంగాణ ఉన్నత విద్యా మండలి T-SAT వారితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందని అన్నారు. అలాగే T-SAT ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి ఉన్నత విద్యను అందించాల్సిన అవసరం ఉందని, నాణ్యత ప్రమాణాలతో కూడిన నిపుణులను ఎంచుకోవాలని, అన్ని విశ్వవిద్యాలయాలు కూడా T-SATను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్-చైర్మెన్ ప్రొ. ఇటికాల పురుషోత్తం, వైస్-చైర్మెన్ SK మహ్మమూద్, సెక్రటరీ ప్రొ. శ్రీరాం వెంకటేష్ పాల్గొన్నారు.
Also Read: Case Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు!
టీ- శాట్ అంటే ఏమిటి?
టీ-శాట్ (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్) అనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సమాచార శాఖ ద్వారా నడుపబడుతున్న టీవీ ఛానల్. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సాంకేతికత పరిజ్ఞానంతో, నాణ్యమైన ప్రమాణాలతో వారికవసరమైన సమాచారాన్ని లక్ష్యంతో ఈ టీ-శాట్‌ను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. మన టీవీ స్థానంలో టీ శాట్ పేరుతో కొత్త నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 2017 జూలై 26న ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. విద్య, నిపుణ పేరుతో రెండు ఛానళ్ళను, టీ-శాట్ లోగోను, యాప్‌ను ఆవిష్కరించారు.