KCR Vs BJP : ‘‘తెలంగాణకు ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే’’ అని ఇటీవలే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ విమర్శించారు. ఈ విమర్శలో నిజమెంత అంటే.. దాదాపుగా నూటికి నూరు శాతం నిజం లేదని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ చొరవ చూపకుంటే తెలంగాణ ఏర్పడకపోయేది. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణకు విలన్‌గా చెప్పడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాన్ని కేసీఆర్ చేశారని రాజకీయ పండితులు అంటున్నారు.
Also Read :Target PoK : పీఓకేపైనే భారత్ గురి.. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లే లక్ష్యం
బీఆర్ఎస్‌కు నిజమైన విలన్ ఎవరు ?
తెలంగాణ రాష్ట్రం సంగతి అలా ఉంచితే.. కనీసం బీఆర్ఎస్(KCR Vs BJP) పార్టీకి నిజమైన విలన్ ఎవరు ? అనే ప్రశ్నకు సమాధానం బీజేపీ. ‘‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ దురుద్దేశంతో కక్షగట్టి నన్ను ఢిల్లీ లిక్కర్ స్కాంలోకి లాగింది. అందుకే నేను కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని గతంలో పలుమార్లు బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం గౌరవనీయ కోర్టు పరిధిలో ఉన్నందున ఎవరూ ఎక్కువగా మాట్లాడటం సరికాదు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీని సూటిగా కేసీఆర్ పల్లెత్తు మాట కూడా అనకపోవడం గమనార్హం. అంతటితో ఆగకుండా గౌరవపూర్వక రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని విలన్‌గా అభివర్ణించడం నీచ రాజకీయాలకు నిదర్శనం.
Also Read :WhatsApp Update : యాప్‌తో పనిలేదు.. ఇక వాట్సాప్ వెబ్ నుంచీ కాల్స్
బీఆర్ఎస్ డౌన్.. బీజేపీ ఓట్ల శాతం అప్
వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పతనంతో ఎదుగుతున్న పార్టీ బీజేపీయే. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈవిషయం నిరూపితమైంది. అయినా కేసీఆర్ ఆ లెక్కలన్నీ పట్టించుకోకుండా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏకపక్ష విమర్శలకు దిగడం సరికాదని రాజకీయ పండితులు అంటున్నారు. 2023 నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓటింగ్‌ను సాధించి 8 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను ఏకంగా 21.08 శాతం మేర పెంచుకుంది. ఆ పార్టీ ఓటింగ్ శాతం మొత్తంగా 35.08 శాతానికి చేరుకుంది. దీంతో రాష్ట్రంలోని 8 లోక్‌సభ స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. తెలంగాణలో ఇంత భారీ సంఖ్యలో బీజేపీ ఎన్నడూ ఎంపీ సీట్లను గెల్చుకోలేదు. బీజేపీ ఎంపీలుగా గెల్చిన వారిలో అత్యధికులు బీఆర్ఎస్ నుంచి జంపైన నేతలే. బీఆర్ఎస్ మునకకు కారణమవుతున్న బీజేపీని వదిలేసి.. స్వయంశక్తితో ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ను కేసీఆర్ టార్గెట్‌గా చేసుకోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో జట్టు కట్టే ఆలోచనలు బీఆర్ఎస్ బాస్ మదిలో ఉండొచ్చని పలువురు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడే సూటిగా చెప్పలేక.. కాంగ్రెసే నంబర్ 1 విలన్ అని పరోక్షంగా కేసీఆర్ చెప్పి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.