KCR: కేసీఆర్ ’24 గంటలు’ ఆఫర్ లోగుట్టు

తెలంగాణ సమాజం లోటుపాట్లు, బలాలు, బలహీనతలు కేసీఆర్ కు బాగా తెలుసు. ఎక్కడో కొడితే తిమ్మతిరిగి కిందపడతారో తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకే ఆయన ఆడింది ఆట పాడింది పాట గా సాగుతుంది.

  • Written By:
  • Updated On - April 10, 2023 / 11:43 AM IST

KCR : తెలంగాణ సమాజం లోటుపాట్లు, బలాలు, బలహీనతలు KCR కు బాగా తెలుసు. ఎక్కడో కొడితే తిమ్మతిరిగి కిందపడతారో తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. అందుకే ఆయన ఆడింది ఆట పాడింది పాట గా సాగుతుంది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు తెలంగాణ సమాజం బలహీనత కేసీఆర్ ధీమాక్ లో ఉంది. అందుకే 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా షాపులు తెరుచుకోవచ్చు అని ప్రకటించారు. దీని వెనుక లోగుట్టు చాలా ఉంది.

తెలంగాణకు పాడి ఆవుల ఉన్న హైదరాబాద్ లో 24 గంటలు వైన్, బార్ షాపులు, పబ్ల్యూ తెరవాలి. అప్పుడు ఆదాయం పెరగాలి. ఆ పని నేరుగా చేస్తే తెలంగాణ సమాజం తిరగబడుతుంది. అందుకే రాష్ట్రం మొత్తం 24 గంటలు షాపులు , దుకాణాలు తెరుచుకోవచ్చు అనేద విధానం ప్రకటించారు. ఒక రకంగా చెప్పాలి అంటే పేద రైతుల పేరుతో రైతు బంధు రూపంలో కుబేరులకు కోట్లు ఇస్తున్నట్టు. హైదరాబాద్ లోని పబ్ల్యూ, బార్లు, వైన్ షాప్ లు దాదాపుగా బీ ఆర్ ఎస్ పార్టీలోని కేసీఆర్ (KCR) సంబంధీకులవే. వాళ్లకు వేల కోట్లు రావాలి అంటే 24 గంటలు లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలి. అందుకోసం రాష్ట్ర పాలసీ ని ప్రకటించారు. ఇది అందరికీ తెలుసు కానీ విపక్షాలు కూడా సైలెంట్ గా ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో లాబీయింగ్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రపంచం మారిపోతోంది. అందుకు తగ్గట్టుగా మనమూ మారాలి. కాన్సెప్ట్ మంచిదే! మరి మారేది ఎవరు? మార్చేది ఎవరు? మారడానికి మర్మం చూపించింది ఎవరు? లోగుట్టు మద్యానికే ఎరుక.! ఇదే అసలు రహస్యం.! తెలంగాణ మొత్తం దుకాణాలమ్మితే వచ్చే ఆదాయమెంత.? రాత్రులంతా మేలుకొని చిన్న చిన్న దుకాణాలు సంపాదించేది ఎంత? తెల్లవార్లూ తెరిస్తే ఎంత? తెరవకపోతే ఎంత.? నిద్ర చెడగొట్టుకొని, ఆరోగ్యం కరాబు చేసుకుంటే మిగిలేది ఎంత.? అందుకే ఏడాదికి ‘పదివేలు మాత్రమే’ అంటూ బంపర్ ఆఫర్…! ఈ మాత్రం దానికి ఏడాదంతా తెల్లవార్లు షాపులు తెరవడం ఎందుకు.? అర్థ రాత్రి దాటితే సరుకు అమ్మొద్దు. ఆ షాపులు తెరవద్దు. ఇతర సరుకుల దుకాణాలు తెరవొచ్చు. దొడ్డి దారిన సరుకు అమ్మకాలకు ద్వారాలు తెరవొచ్చు.

రాష్ట్రమంతటా తెల్లవార్లు షాపుల నిర్వహణ సరే. ఒక్క హైదరాబాదులో మినహా మిగతా జిల్లాలో అర్థరాత్రుల దాక ఉద్యోగాలు వెలగబెట్టే వారు ఎవరు? అంతలా పారిశ్రామికీకరణ జరిగిన జిల్లాలు ఎన్ని? ఇరవై నాలుగు గంటలు మూడు షిప్టులు పనిచేసే కంపెనీలు మెజారిటీ జిల్లాల్లో ఒక్కటైనా ఉందా? రాత్రి పది దాటిందంటే ముసుగు తన్నుకొని‌ పడుకునే జిల్లాలే ఎక్కువ.! ఆ జిల్లాల్లో జనాలు మేలుకొని కొనే సరుకు ఏమిటీ? అవును…అదే తెల్లవార్లూ అమ్మాలంటే అన్ని షాలులు తెరిచి ఉంచుకోవచ్చు. తెరిచిన షాపుల్లో ఏదైనా అమ్ముకోవచ్చు. ఒక్క హైదరాబాదు మేలుకుంటే ఏమొస్తుంది.? తెలంగాణ పల్లెలనీ మేలుకుంటే అంచనా వేసుకున్న బడ్జెట్ ఖజానాకు చేరుతుంది. అమ్మకాలు పెరిగితే చాలు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే చాలు. ఇదే మతలబు. ఒక్క మద్యం షాపులకు ఇరవై నాలుగు గంటల పర్మిషన్ ఇవ్వడం కుదరదు.‌ న్యాయపరమైన చిక్కులు..

ప్రజా వ్యతిరేకత.. ఎందుకు.?

మరి మద్యం అమ్మకాలు మరింత పెరగకపోతే ఆదాయం రాదు. ఖజానా ఖర్చులకు సరిపోదు. అందుకే ఈ దొడ్డిదారి అమ్మకాలు. ఇక ఎప్పుడంటే అప్పుడు అన్ని సరుకులతో పాటు ఆ సరుకు కూడా అందుబాటులోకి వచ్చేందుకు ఇదే సరైన మార్గం. ఆదాయం పెంచుకునే మార్గం.దాని వల్ల ఒక్క శాఖకే కాదు.. వైద్యరంగానికి కూడా మేలే.! అసలే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మొదలుపెట్టిన ఆసుపత్రులకు వస్తున్న ఆదాయం కిరాయలకు కూడా సరిపోవడం లేదు. మరి వాళ్లు కూడా బాగుపడాలి. జనాలను ‘జలగల్లా’ పీల్చేస్తున్నా, ఆసుపత్రులంటే దేవాలయాలే అనుకోవాలి.? వాటి దూపదీప నైవేద్యాలు కావాలంటే జనం రోగాల బారిన పడాలి. ఇలా షాపులు ఇరవై నాలుగు గంటలు తెరిస్తే బహుకుశలోపరి. జనం సొమ్ము జేబుల్లో లేకుండా చేయొచ్చు. ఖజానా నింపుకోవచ్చు. జనం ప్రభుత్వం వైపు ఆశగా చూసేలా చేయొచ్చు.‌ ఏ రోజు సంపాదన… ఆ రోజే ఖర్చు‌ చేసుకొని ప్రభుత్వ ఖజానా జనమే నింపొచ్చు. ఎనిమిదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో సుమారు లక్ష కోట్ల మద్యం తెలంగాణ సమాజం తగ్గింది. దాన్ని రెట్టింపు చేయటం కోసం కేసీఆర్ (KCR) వేసిన మాస్టర్ ప్లాన్ వెనుక 24 గంటల రహస్యం దాగివుంది.

Also Read:  BRS in AP: ఏపీ రాజకీయాల్లో ‘బీఆర్ఎస్ ‘ బోల్తా