Site icon HashtagU Telugu

KCR- Kamareddy : కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లో కేసీఆర్ వెనుకంజ

Reasons Behind Defeat of KCR

Reasons Behind Defeat of KCR

KCR- Kamareddy : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అనూహ్య ఫలితం వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్‌లో సీఎం కేసీఆర్ సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.  బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఆధిక్యం ప్రదర్శించారు. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన 1000 ఓట్లను కౌంట్ చేయగా మెజారిటీ ఓట్లు రమణారెడ్డికి వచ్చాయి. కామారెడ్డిలో అత్యధికంగా 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో యావత్ రాష్ట్రం ఫోకస్ ఉన్న కామారెడ్డి స్థానంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత పెరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు వేసిన ఓట్లే పోస్టల్ బ్యాలెట్‌లో ఉంటాయి. కామారెడ్డిలో ఒక్కో పోలింగ్ బూత్‌లో మూడు చొప్పున ఈవీఎంలను వాడారు. ఇక్కడ తుది ఫలితం వచ్చే సరికి ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. ఒక్కో టేబుల్ పై మూడు ఈవీఎంలను పెట్టి లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్ లెక్కించడానికి 25 నిమిషాల టైం పడుతుంది. మధ్యాహ్నం 1 లేదా 2 గంటల తర్వాత కామారెడ్డి రిజల్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  కేసీఆర్ కు సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ఆయనదే గెలుపు అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు ఇక్కడి నుంచి టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో(KCR- Kamareddy) ఉన్నారు.

Also Read: Hindi Belt : రాజస్థాన్‌లో 41 చోట్ల బీజేపీ లీడ్.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ లీడ్