తెలంగాణ ఫలితాల ఫై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉండగా..మరోపక్క బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలు మాత్రం ఎవరికీ వారు కేబినెట్ సమావేశాల తేదీలను ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా డిసెంబర్ 04 న కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం (Telangana Cabinet Meeting) ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటె తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియా కు తెలిపారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కవగా నమోదయ్యాయని అన్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో పోలింగ్ 3 శాతం తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక నియోజక వర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకుత్‌పురాలో 39.6 శాతం పోలింగ్ నమోదైందని .. చాలా చోట్ల రాత్రి 9.30 వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. ఆదివారం ఉదయం 8.00 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెకిస్తారని, ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు.
Read Also : Hyderabad Voters: బద్ధకించిన హైదరాబాద్ ఓటర్స్.. 50 లక్షల మంది నో ఓటింగ్!