KCR Survey : 35 మందికి ముడింది.! తేల్చేసిన లేటెస్ట్ స‌ర్వే

క‌నీసం 30 నుంచి 35 మంది అభ్య‌ర్థులను మార్చ‌క‌పోతే(KCR Survey) బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మూడోసారి రావ‌డం క‌ష్ట‌మ‌ని స‌ర్వే తేల్చేసింది.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 04:42 PM IST

క‌నీసం 30 నుంచి 35 మంది అభ్య‌ర్థులను మార్చ‌క‌పోతే(KCR Survey) బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మూడోసారి రావ‌డం క‌ష్ట‌మ‌ని స‌ర్వే తేల్చేసింది. ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ చేయించుకున్న అంత‌ర్గ‌త స‌ర్వేగా మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోన్న దాని ప్ర‌కారం 60శాతం మంది ప్ర‌జ‌లు సానుకూలంగా ఉన్నారు. అయితే, 35 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌పై ఓట‌ర్లు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని స‌ర్వే సారాంశం. ఆ స‌ర్వే ది న్యూ ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ పేరుతో మీడియాలో గుప్పుమంది. స్వ‌యంగా కేసీఆర్ చేయించుకున్న అంత‌ర్గ‌త స‌ర్వేగా ప్రాచుర్యం పొందింది.

35 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌పై ఓట‌ర్లు వ్య‌తిరేకం(KCR Survey)

మూడోసారి అధికారంలోకి కేసీఆర్  (KCR Survey) రావ‌డం త‌థ్య‌మ‌ని తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ తేల్చాశారు. రాబోవు రోజుల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌, చ‌త్తీస్ గ‌డ్ మాత్ర‌మే కాంగ్రెస్ ఖాతాలోకి వెళుతుంద‌ని ఆయ‌న అంచ‌నా. తెలంగాణ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళుతుంద‌ని, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో బీజేపీ జెండా ఎగరేస్తుంద‌ని పీకే స‌ర్వేలోని తాజా ఫ‌లితాలు. వాటి ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం క‌ష్టమ‌ని తేల్చారు. అంత‌ర్గ‌త గ్రూపులు, స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా కాంగ్రెస్ పార్టీ భారీగా న‌ష్ట‌పోతుంద‌ని పీకే వేసిన అంచ‌నా. ఇక మూడోసారి కేసీఆర్ సీఎం కావ‌డానికి అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ఆయ‌న తేల్చారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ అంత‌ర్గ‌తంగా చేయించిన స‌ర్వే భిన్నంగా ఉంది.

మూడోసారి అధికారంలోకి కేసీఆర్   

భారత రాష్ట్ర సమితి (BRS) స్వ‌యంగా చేసిన స‌ర్వే ప్ర‌కారం ప‌లు స‌వాళ్ల‌ను గుర్తించింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం ప్రభుత్వ పనితీరుపై 60 శాతం సంతృప్తి రేటు ఉంది. పార్టీకి చెందిన 30-35 మంది సిట్టింగ్ అభ్య‌ర్థులు స్థానిక ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నార‌ని తేల్చ‌డం ఆ పార్టీ పెద్ద స‌వాల్ గా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు అంతర్గత వర్గపోరు ఉందని( KCR Survey) సర్వే వెల్లడించింది. అభ్యర్థిత్వంలో మార్పు రావడమే దీనికి ప్రధాన కారణం. ఉదాహరణకు, ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల అనుచరులు, రెండవ శ్రేణి నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ విభేదాలు నేతల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట‌మికి కార‌ణం కావ‌డానికి ఛాన్స్ ఉంద‌ని తేల్చింది.

Also Read : KCR Strategy : కేసిఆర్ మౌనవ్యూహం ఏమిటి?

ఇక కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కూడా పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని తెలంగాణ మంత్రి హరీశ్‌రావును మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించిన విష‌యం విదిత‌మే. మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమంతరావు మాట్లాడుతూ.. ‘నేను మల్కాజిగిరి నుంచి, నా కుమారుడు రోహిత్‌రావు మెదక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాం. మెదక్‌లో హరీష్‌రావు అంతు చూస్తా..` అంటూ హెచ్చ‌రించారు. అంతర్గత పోరుతో పాటు నల్గొండలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజాదరణ బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓట‌మికి కార‌ణం కానుంది. ఆ జిల్లాలోని ఆరు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓట‌మి దిశ‌గా ఉన్నార‌ని సర్వే వెల్లడించింది.

Also Read : BRS South Sketch : ద‌క్షిణ తెలంగాణ‌పై KCR ప్లాన్ B

బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా భావిస్తున్న రంగారెడ్డి జిల్లాలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్టిపోటీ ఎదురుకావచ్చ‌ని స‌ర్వే అంచ‌నా వేసింది. హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్‌ఎస్‌కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సర్వేను అనుసరించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టికే బుజ్జ‌గింపుల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తోంది. ఒక వేళ అప్ప‌టికీ మెరుగుప‌డ‌క‌పోతే, అభ్య‌ర్థుల‌ను చివ‌రి నిమిషంలో మార్చాల‌ని స‌ర్వే తేల్చి చెప్పింది.