KCR Stratagy : కేసీఆర్ కు బ్రాహ్మణుల జ‌ల‌క్‌, స‌ద‌న్ ప్రారంభ ఆహ్వాన ర‌గ‌డ

ఒక్కో ఎన్నిక‌కు ఒక్కోలా ప్లాన్ చేస్తుంటారు కేసీఆర్ (KCR Stratagy). ఈసారి మ‌త‌, కుల ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌లు ఉంటాయ‌ని స‌ర్వేల సారాంశం.

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 05:22 PM IST

ఒక్కో ఎన్నిక‌కు ఒక్కోలా ప్లాన్ చేస్తుంటారు కేసీఆర్ (KCR Stratagy). ఈసారి మ‌త‌, కుల ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌లు ఉంటాయ‌ని స‌ర్వేల సారాంశం. హిందూ ఓట్ల కోసం బీజేపీ ప్ర‌యత్నం చేస్తోంది. ఆ క్ర‌మంలో ముస్లిం ఓటు బ్యాంకును దూరం చేసుకోవ‌డానికి కూడా సిద్ద‌ప‌డేలా ఆ పార్టీ చ‌ర్య‌లు ఉన్నాయి. తొలి నుంచి బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం ఆధిప‌త్యం బీజేపీలో ఉంది. ప్ర‌ధాన మంత్రిగా బీసీ వ‌ర్గానికి చెందిన మోడీ ఉన్న‌ప్ప‌టికీ నాగ‌పూర్ ఆర్ఎస్ఎస్ ఆధిప‌త్యం ఆ పార్టీలో క‌నిపిస్తుంద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే.

ఒక్కో ఎన్నిక‌కు ఒక్కోలా ప్లాన్ చేస్తుంటారు కేసీఆర్ (KCR Stratagy)

ప్రాంతీయ వాదం మాత్ర‌మే రెండుసార్లు కేసీఆర్ ను సీఎం పీఠం మీద కూర్చోబెట్టింది. ఈసారి ఆయ‌న జాతీయవాదాన్ని వినిపిస్తున్నారు. అందుకే, తెలంగాణ వాదం మ‌రుగున ప‌డింది. మ‌తం, కులం ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌లు ఉంటాయ‌ని అంచ‌నాకు వ‌స్తున్నారు. అందుకే, హిందూమ‌తం ఓట్ల కోసం దేవాల‌యాల అభివృద్ధి పేరుతో వేల కోట్ల కేటాయింపుకు ముందుకొచ్చారు. కొండ‌గట్టు ఆంజ‌నేయుని దేవాల‌యానికి 100కోట్లు కేటాయించారు. కానీ, అక్క‌డ జ‌రిగిన రోడ్డు ప్ర‌మాద స‌మ‌యంలో ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. ఇక యాదాద్రిని ఇప్ప‌టికే అభివృద్ధి చేశారు. వేముల‌వాడ త‌దిత‌ర దేవాల‌యాల‌కు నిధులు ఇచ్చేందుకు కేసీఆర్ ఉదారంగా ఉన్నారు. హిందూ ఓట‌ర్ల‌ను బీజేపీకి మ‌ళ్ల‌కుండా (KCR Stratagy)జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. అయితే, ఇక్క‌డే ఆయ‌న‌కు బ్రాహ్మ‌ణుల రూపంలో షాక్ త‌గ‌ల‌నుంది.

Also Read : CM KCR: తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. దశాబ్ది ఉత్సవాలు!

బ్రాహ్ముణులు స‌హ‌జంగా బీజేపీ వైపు ఎక్కువ‌గా ఉంటారు. వాళ్ల‌ను ఆక‌ర్షించ‌డానికి కేసీఆర్ 12కోట్ల‌తో బ్రాహ్మ‌ణ స‌ద‌న్ నిర్మాణానికి నిధులు ఇచ్చారు. గోప‌న్న‌ప‌ల్లి వ‌ద్ద నిర్మించిన విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ స‌ద‌న్ ప్రారంభోత్స‌వానికి బుధ‌వారం ముహూర్తం పెట్టారు. దానికి సీఎం కేసీఆర్ హాజ‌రు కానున్నారు. అక్క‌డ కేసీఆర్ సంగ‌తి తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కార‌ణం ఏమంటే, వైష్ణ‌వుల‌కు మిన‌హా ఇత‌ర శాఖ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలేద‌ని కేసీఆర్ మీద మండిప‌డుతున్నారు. అంతేకాదు, వైష్ణ‌వ దేవాల‌యాల‌ను మాత్రమే అభివృద్ధి చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. మామూలుగా కంటికి క‌నిపించ‌ని కేసీఆర్ ను స‌ద‌న్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా నిల‌దీయాల‌ని బ్రాహ్మ‌ణులు ప్లాన్ చేస్తున్నారు.

వైష్ణ‌వులు, శైవుల‌కు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా

బ్రాహ్మ‌ణుల్లో బ్రాహ్మ‌ణ‌, ఆరాధ్య‌, మ‌ధ్య‌, క‌ర‌ణం, వైష్ణ‌వ శాఖ‌లు ప్ర‌ధానంగా ఉన్నాయి. ఒక్కోశాఖ‌కు ఒక్కోలా విధుల‌ను పూర్వీకులు నిర్ణ‌యించారు. దాని ప్ర‌కారం ఆయా శాఖ‌ల పనితీరు ఉంటుంది. పూర్వం నుంచి వైష్ణ‌వులు, శైవుల‌కు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా వివాదాలు ఉండేవ‌ని చ‌రిత్ర చెబుతోంది. ఆధునిక కాలంలోłఅలాంటి విభేదాలు బ‌య‌ట‌కు క‌నిపించ‌న‌ప్ప‌టికీ వైష్ణవులు, శైవుల‌కు ప‌డ‌దు. ప్ర‌త్యేకించి క‌ర‌ణాల‌ను మిగిలిన శాఖ‌లు దూరంగా పెడుతుంటారు. ఆ వ్య‌త్యాసం ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అంత‌ర్గ‌తంగా ఉన్న విభేదాలు బుధ‌వారం రోజున ప్రారంభించే బ్రాహ్మ‌ణ స‌ద‌న్ వేదిక‌గా పొడ‌చూప‌నున్నాయి.

Also Read : KCR Governament : వరంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు తాక‌ట్టు! RBIకి ఫిర్యాదు

స‌ద‌న్ ప్రారంభోత్సవ ఆహ్వాన ప‌త్రిక‌లో సీఎం కేసీఆర్, మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఇక బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం నుంచి బ్రాహ్మణ ప‌రిష‌త్ చైర్మ‌న్ ర‌మ‌ణాచారి, ఎమ్మెల్సీలు దేశ‌ప‌తి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ వాణి పేర్లు మాత్ర‌మే ఉన్నాయి. తెలంగాణ మొత్తం మీద వ‌రంగ‌ల్ జిల్లా నుంచి ఎన్నికైన స‌తీష్ కుమార్ పేరు ఇన్విటేష‌న్లో లేదు. ఉద్దేశ‌పూర్వ‌కంగా వైష్ణ‌వ ఆధిప‌త్యాన్ని ఆహ్వాన‌ప‌త్రిక‌లో చూపార‌ని ఆయ‌న అభిమానులు మండిప‌డుతున్నారు. గ‌తంలోనూ ప‌లు ప‌ద‌వులు వైష్ణ‌వుల‌కు ఇచ్చార‌ని జాబితా బ‌య‌ట‌కు తీస్తున్నారు. దీంతో కేసీఆర్ వేసిన బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం ఓట్ల పాచిక బెడిసికొట్టేలా ఉంది. హిందూ ఓట‌ర్ల‌ను బీఆర్ఎస్ వైపు మ‌లుపుకోవ‌డం ఈజీ కాద‌ని ఆయ‌న‌కు(KCR Stratagy) బోధ‌ప‌డుతోంది.