టీఆర్ఎస్ ప్లీనరీ.. గులాబీ బాస్ స్పీచ్ హైలైట్స్!

ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ.. ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో అవమానాలు.. ఎన్నో అడ్డంకులు.. ఎన్నో గెలుపుఓటములను చవిచూసింది.

  • Written By:
  • Publish Date - October 25, 2021 / 01:28 PM IST

ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ.. ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో అవమానాలు.. ఎన్నో అడ్డంకులు.. ఎన్నో గెలుపుఓటములను చవిచూసింది. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల నాటి కలను ముద్దాడింది. ప్రత్యేక తెలంగాణ సాధించింది వరుసగా రెండుసార్లు అధికారం కైవసం చేసుకుంది. ఇవాళ టీఆర్ఎస్ ప్లీనర్ సందర్భంగా అధినేత కేసీఆర్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లు…

  1. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు అపోహలు. అనుమానాలు. విశ్వాస రాహిత్య పరిస్థితీ ఉండేది. గాంధీజీ ఎన్నో ఆందోళన పిలుపు లు విఫలమయినా పోరాటాన్ని ఆపలేదు. జలియన్ వాలా బాగ్ తర్వాత కూడా స్వాతంత్ర్య పోరాటం సాగింది. తెలంగాణ ఉద్యమం కూడా అలాగే సాగింది.
  2. రాజ్యసభ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయం లో కూడా సమైక్యవాదులు అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకున్నాం. పాలన లో ఏడేళ్ళ నుంచి ఎనిమిదేళ్ల లోకి ప్రవేశించాం.
  3. అభివృద్ధికి సామాజిక స్పృహ జోడించడం క్లిష్టమైన ప్రక్రియ. అయితే తెలంగాణ లో సక్సెస్ అయ్యాం. కొందరు తెలంగాణ కారు చీకటి అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని చెప్పిన వారికి మనం పాలనతో సమాధానం చెప్పాం.
  4. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మన అభివృద్ధిని చాటుతున్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయం వృద్ధి లో తెలంగాణ జాతీయ స్థాయి కన్నా ముందుంది. ఏ రంగాల్లో అపోహలు వ్యక్తం అయ్యాయో ఆ రంగాల్లో విజయం సాధించి చూపాము.
  5. పంజాబ్ ను తలదన్నే రీతిలో 3 కోట్ల  టన్నుల ధాన్యాన్ని పండించాం. తెలంగాణ పథకాల తమ రాష్ట్రం లో ప్రవేశ పెట్టాలని కర్ణాటక. మహారాష్ట్ర లోని ప్రజలు కోరుతున్నారు. నాందేడ్ జిల్లా ఐదు నియోజకవర్గాల ప్రజలు తెలంగాణ లో కలుస్తా మంటున్నరు. రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు మెచ్చుకుని తమ రాష్ట్రంలో వాటిని ప్రవేశ పెట్టాలని కోరారు. దళిత బంధు స్ఫూర్తితో టీఆర్ఎస్ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభించాలని అక్కడ్నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
  6. ఇంతగా తెలంగాణ అభివృద్ధి చెందడం నా ఒక్కడి వల్ల సాధ్య పడలేదు. ఇందులో అందరి కృషి ఉంది. సర్పంచ్ నుంచి పై వరకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు. ప్రతీశక్తులు అపుడు ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయి. అన్నింటినీ అధిగమించి ముందుకు పోతున్నాం.
  7. సాగునీటి ప్రాజెక్టుల కు కోర్టుల్లో అడ్డంకులు సృష్టించారు. వాటిని అధిగమించాం. తెలంగాణ లో కులం. మతం అనే ఇరుకైన ఆలోచన మాకు లేదు. దళిత బంధు ఓ సామాజిక స్వాంతన పథకం. ఇది దేశానికి స్ఫూర్తి. రైతు బంధు ప్రారంభించినపుడు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇపుడు కూడా దళిత బంధు పై అవాకులు చవాకులు పేలుతున్నారు. దళిత బంధు కు అయ్యేది లక్షా 70 వేల కోట్ల రూపాయలు తెలంగాణ కు ఓ పెద్ద లెక్క కాదు.
  8. 2028 కల్లా తెలంగాణ బడ్జెట్ నాలుగు లక్షల కోట్లకు చేరుతుంది. తలసరి ఆదాయం తొమ్మిది లక్షల రూపాయలు చేరుతుంది. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు కొందరు సీఎం లు ఇన్ని డబ్బులు అన్ని పథకాలకు ఎలా తెస్తున్నారని అడిగారు. దానికి సాహసం కావాలి.
  9. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహాసం తో ముందుకు సాగి విజయం సాధించాం. దళిత బంధు ను కూడా నూటికి నూరు పాళ్లు అమలు చేస్తాం. ఇతర వర్గాలకు కూడా ఏదైనా చేయాలంటే అది టీ ఆర్ ఎస్ వల్ల మాత్రమే సాధ్యం.
  10. కాంగ్రెస్ బీజేపీ లు డిపాజిట్లు కోల్పోయే పార్టీలు. టీ ఆర్ ఎస్ మాత్రమే తెలంగాణ అంతటా యూనిఫామ్ గా ఉన్న పార్టీ. టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కు శ్రీరామ రక్ష. ఇదే ధృతి ఉధృతి కొనసాగాలి.  మనకు బాస్ లు తెలంగాణ ప్రజలే.. హై కమాండ్ ఎవ్వరూ లేరు.