KCR Speech: 1956 నుంచి తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సే: కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు 10-12 మంది బీఆర్‌ఎస్ ఎంపీలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోరుబాట బస్సుయాత్రలో బుధవారం కేసీఆర్ ఈ రోజు మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి పోరులో భాగంగా 21 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో కూడా ఇదే తరహాలో సభలో ప్రసంగించారన్నారు.

KCR Speech: తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు 10-12 మంది బీఆర్‌ఎస్ ఎంపీలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోరుబాట బస్సుయాత్రలో భాగంగా కేసీఆర్ ఈ రోజు మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి పోరులో భాగంగా 21 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో ఇదే తరహాలో సభలో ప్రసంగించారన్నారు. రాష్ట్రంలో నాలుగు నెలల క్రితం రైతులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కానీ ఇప్పుడు రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా నిరాశకు గురయ్యారు. నీళ్ల కోసమే తెలంగాణ సాధించుకున్నాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్గొండ ప్రాంతానికి చెందిన వారైనా కేఆర్‌ఎంబీకి అధికారాలు అప్పగించారు అని విమర్శించారు.

అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి అంటాడు. అయితే రైతులు చెప్పులు కూడా గట్టిగానే ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు గమనించాలని మండిపడ్డారు కేసీఆర్. తెలంగాణ వచ్చాక పంటలు ఎండాయంటే ఇదే తొలిసారి. కరెంట్‌ కోతలెందుకు వస్తున్నాయి? ఎక్కడికి పోయింది కరెంట్‌? ఎందుకు ప్రజలను బాధపెడుతున్నారు. కరెంట్‌ను ఇవ్వడం కూడా చేతకావడం లేదా?. మిషన్‌ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు. అది మీ చేతకాని తనం కాదా?. కేసీఆర్‌ను తిట్టడమే కాంగ్రెస్‌ నేతలు పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్.

బీఆర్ఎస్ హయాంలో 18 పంటలకు నీళ్లిచ్చాం. రైతు బీమా ఉంటదో ఉండదో తెలవదు. రైతు బంధు ఐదెకరాలకే అంటున్నారు. ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనడం లేదని రైతులు నాతో అన్నారు. కేంద్రం గతంలో ధాన్యం కొననంటే మెడలు వంచి కొనిచ్చాం. కల్యాణ లక్ష్మీ కింద తులం బంగారు ఇస్తామన్నారు. ఇంతవరకు లేదు. రెండు లక్షల రుణమాఫీ ఏమైంది?. మేము రైతు బంధు కింద సంవత్సరానికి 16,000 కోట్లు ఇచ్చాము. రెండు దశల్లో 30,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేసాము. అయితే కాంగ్రెస్ అన్ని విషయాల్లోనూ అబద్ధాలు చెప్పింది. మహాలక్ష్మి కింద రూ.2,500 ఇస్తామని మాయమాటలు చెప్పారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారని కేసీఆర్ మండిపడ్డారు.

We’re now on WhatsAppClick to Join

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తే ప్రభుత్వం మెడలు వంచుతాం. కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపిస్తా అంటున్నారు. వీటికి కేసీఆర్ బయపడతాడా?. అంబేడ్కర్‌ పుణ్యమా అని తెలంగాణ వచ్చింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కడితే. జయంతికి ఒక్కరు పోలేదు అంటూ అధికార కాంగ్రెస్ పై కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అంతేకాదు 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువు కాంగ్రెస్సేనని సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.

Also Read: Chandrababu : బొటన్‌ నొక్కేందుకు నువ్వేందుకు ముసలమ్మ చాలు