Site icon HashtagU Telugu

Rythu Bandhu: నేను రోడ్డెక్కినందుకే రైతు బంధు ఇచ్చిండ్రు: కేసీఆర్

Rythu Bandhu

Rythu Bandhu

Rythu Bandhu: తెలంగాణ ప్రభుత్వం తన ‘పోరు బాట’ బస్సు యాత్రకు భయపడి రైతులకు ‘రైతు బంధు’ ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించిందని చెప్పారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. రైతు బంధు, పంట రుణమాఫీ, రూ.500 బోనస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కేసీఆర్‌ రోడ్డుపైకి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటమిని అంగీకరించి పంపిణీకి ఆదేశించారన్నారు ఆయన. అయితే ముఖ్యమంత్రి ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు పంపిణీని చేయవచ్చన్నారు. కాబట్టి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా మా ఒత్తిడిని కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.

బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేసీఆర్ గత దశాబ్ద కాలంలో 150 హామీలు ఇచ్చిన బీజేపీ వాటిని సాకారం చేయడంలో విఫలమైందని అన్నారు. కేసీఆర్, మోదీ ఒకేసారి సీఎం, పీఎం అయ్యారని అయితే కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చారన్నారు. మతాల మధ్య విద్వేషాలు పెంచుతుందని బీజేపీని విమర్శించారు.కాగా నేను బీజేపీ కూటమిలో భాగం కావడానికి నిరాకరించాను కాబట్టి నరేంద్ర మోదీ నా కుమార్తె కవితను అరెస్టు చేశారని అయినా కానీ నేను లొంగిపోనన్నాడు కేసీఆర్.

We’re now on WhatsAppClick to Join

ఈ రోజు కేసీఆర్ నిజామాబాద్‌లో బస్సుయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారు. పెద్దఎత్తున ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి కావాలని సూచిస్తూ సీఎం…సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో కాస్త సేపు ప్రసంగాన్ని కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మోదీ మీ ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేశారని విన్నాను నిజమేనా అని ఆయన ప్రశ్నించారు. అలాగే నిజామాబాద్‌కు బీజేపీ ఎంపీ కావటంతో నిజామాబాద్ ప్రజలకు రూ.30 లక్షలు అందాయని తాను విన్నానని ఎద్దేవా చేశారు. అయితే కేసీఆర్ ప్రసంగానికి జనం పగలబడి నవ్వారు.

Also Read: JP Nadda: అయోధ్య రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది!