Site icon HashtagU Telugu

KCR-Revanth-KTR Campaign : నేడు కేసీఆర్ , రేవంత్ , కేటీఆర్ లు పోటాపోటీ పర్యటనలు

Kcr Revanth Ktr Campaign

Kcr Revanth Ktr Campaign

తెలంగాణ ఎన్నికల ప్రచార (Telangana Election Campaign ) సమయం ముంగిపు కు చేరుకోవడం తో అన్ని పార్టీలకు సంబదించిన నేతలు , అభ్యర్థులు పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) లు ఇద్దరు చెరోవైపు పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే సింహం సింగిల్ గా వస్తుందన్నట్లు ఒక్కడే రాష్ట్రం మొత్తం చుట్టేస్తూ కాంగ్రెస్ హామీలను ప్రజలకు వివరిస్తూ..బిఆర్ఎస్ పాలనను ఎండగడుతూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నేడు ఐదు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి , నాల్గు నియోజకవర్గాల్లో కేసీఆర్ , కేటీఆర్ (KTR) లు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. గత కొద్దీ రోజులుగా రేవంత్ కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభల్లో పాల్గొంటూ వస్తున్నా సంగతి తెలిసిందే. ఈరోజు సంగారెడ్డి, సిద్దిపేట , నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే, సాయంత్రం హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి , శేరిలింగంపల్లిలో రోడ్‌ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.

ఇక కేసీఆర్..తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే మంత్రి కేటీఆర్.. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు.

Read Also : Casting Couch : షూటింగ్ లో బాలకృష్ణ అసభ్యకరంగా ఇబ్బంది పెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్