Site icon HashtagU Telugu

Kavitha Comments : కవిత పై కేసీఆర్ యాక్షన్ కు సిద్ధం..?

Kcr Action Kaivtha

Kcr Action Kaivtha

ఎమ్మెల్సీ కవిత (Kavitha) చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో పెద్ద కలకలానికి దారితీశాయి. హరీష్ రావు, సంతోష్ రావులపై అవినీతి ఆరోపణలు చేస్తూ, వీరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ప్రకటించడం పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రేపింది. కేసీఆర్‌ మీద సీబీఐ విచారణ జరుగుతుండగా, “పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా ఆమె మాట్లాడిందని, అందుకే ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం వెలువడుతోంది.

 

Kaleshwaram Project : ఆ ఇద్దరి అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు – కవిత సంచలన వ్యాఖ్యలు

గత మేలో కవిత తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ బయటకు రావడం వల్లే మొదట వివాదం ప్రారంభమైంది. ఆ లేఖలో పార్టీ వ్యవహార శైలి, సంస్థాగత లోపాలు, బీజేపీతో సంబంధాలపై ఆమె విమర్శలు చేశారు. అది లీక్ కావడంతో పార్టీ లోపలి విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత కవితను బీఆర్ఎస్‌లో పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే కవిత తన “జాగృతి” సంస్థ కార్యక్రమాలపై దృష్టి పెట్టి, దానిని బలోపేతం చేస్తూ వేరే దారిలో నడుస్తున్నారు.

ప్రస్తుతం కవిత ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో అగ్రనేతల మధ్య మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బలహీనపడిన పార్టీకి ఇలాంటి విభేదాలు మరింత దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కవిత ఆరోపణలు హరీష్ రావు, సంతోష్ రావులపై ఉండడం వల్ల, నేతల మధ్య అపనమ్మకం పెరుగుతోందని భావిస్తున్నారు. దీంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారుతుందని హైకమాండ్ అంచనా వేస్తోంది. కేసీఆర్ కూడా ఈ పరిణామాలతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని, త్వరలో కవిత భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాల సమాచారం.