KCR & Press Meets: కేసీఆర్ మూడుసార్లు `ప్రెస్ మీట్‌` లోగుట్టు ఇదే!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజకీయాల్లో ఆరితేరిన లీడ‌ర్‌. ఎలాంటి ఉద్దేశ్యం..ల‌క్ష్యం లేకుండా మీడియా ముందుకు వ‌చ్చే నేత కాదు. కానీ, గ‌త వారం రెండుసార్లు, ఈ వారం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌సారి మీడియా ముందుకు వ‌చ్చాడు.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 11:23 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజకీయాల్లో ఆరితేరిన లీడ‌ర్‌. ఎలాంటి ఉద్దేశ్యం..ల‌క్ష్యం లేకుండా మీడియా ముందుకు వ‌చ్చే నేత కాదు. కానీ, గ‌త వారం రెండుసార్లు, ఈ వారం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌సారి మీడియా ముందుకు వ‌చ్చాడు. మూడు ప్రెస్ మీట్ల‌ను గ‌మ‌నిస్తే…తొలి ప్రెస్ మీట్ లో దేశాన్ని పాలించే అర్హ‌త మోడీకి లేద‌నే రీతిలో రెచ్చిపోయాడు. భార‌త్, చైనా స‌రిహ‌ద్దుల గురించి ప్ర‌స్తావించిన ఆయ‌న దేశ వ్యాప్తంగా చర్చ‌ను లేవ‌దీశాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత పెట్టిన తొలి ప్రెస్ మీట్ లో దాదాపు నాలుగుసార్లు ఈడీ, ఐటీశాఖ దాడుల గుర్తించి ప్ర‌స్తావించాడు. జైలు కు పంపే ద‌మ్ము ఉందా? అంటూ బీజేపీ లీడ‌ర్ల‌కు స‌వాల్ చేశాడు. టచ్ చేసి చూడండంటూ ఆగ్ర‌హించాడు. వ‌రి పంట‌ను వేయండ‌ని చెబుతోన్న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ మీద ఫైర్ అయ్యాడు.

Also Read: చంద్ర‌బాబు రాజ్యంలో పుంగ‌నూరు రెడ్డి!

రెండోసారి ప్రెస్ ముందుకు వ‌చ్చిన కేసీఆర్ బీజేపీ తెలంగాణ‌శాఖ‌ను ల‌క్ష్యంగా చేసుకున్నాడు. వ‌రి ధాన్యం కొనుగోలుపై బీజేపీ చెబుతోన్న మాట‌ల‌ను న‌మ్మొద్ద‌ని వాస్త‌వాల‌ను తెలియ‌చేశాడు. వ‌రి ధాన్యం కొనుగోలుపై బీజేపీ ఇచ్చిన నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌తిగా టీఆర్ఎస్ ధ‌ర్నాల‌కు దిగుతుంద‌ని వెల్ల‌డించాడు. క్షేత్ర‌స్థాయిలో ఎంత దూర‌మైన బీజేపీతో కొట్లాడ‌తామ‌ని హెచ్చ‌రించాడు. ఆ సంద‌ర్భంగా పోటాపోటీ ధ‌ర్నాల‌తో గులాబీ, క‌మ‌లనాథులు తెలంగాణాలో హూంక‌రించారు. వ‌రి ధాన్యం కొనుగోలు బాధ్య‌త కేంద్రంలోని బీజేపీదేనంటూ ధ్వ‌జ‌మెత్తాడు.
మూడోసారి ఏకంగా ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగుతామ‌ని వెల్ల‌డించాడు. బీజేపీ ద్వంద్వ ప్ర‌మాణాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయ‌డానికి సిద్ధ‌మంటూ పిలుపునిచ్చాడు. ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ధాన్యం కొనుగోలు ప‌రిమాణాన్ని తెలియ‌చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. కేంద్రం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తుందో.. చెప్పాల‌ని నిల‌దీశాడు. తెలంగాణ ప్ర‌జ‌ల ఎదుట టీఆర్ఎస్ ను దోషిగా బీజేపీ నిలుపుతోంద‌ని ఆయ‌న గ్ర‌హించాడు. అందుకే, ఢీ అంటే ఢీ అనే రీతిలో బీజేపీ మీద సుదీర్ఘ పోరాటానికి కేసీఆర్ పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
మూడు సార్లు ఆయ‌న పెట్టిన ప్రెస్ మీట్ ల సారాంశాన్ని గ‌మ‌నిస్తే, బీజేపీ మీద రాబోవు రోజుల్లో మ‌రింత రాజ‌కీయ దాడికి దిగ‌బోతున్నార‌ని అర్థం అవుతోంది. తొలి విడ‌త మీడియా రూపంలో మోడీ మీద దాడికి దిగాడు. రెండో విడ‌త క్షేత్ర‌స్థాయిలో ధ‌ర్న‌ల రూపంలో బ‌లం చూపే ప్ర‌య‌త్నం చేశాడు. మూడో విడ‌త రోడ్డ మీద తేల్చుకోవడానికి ఇందిరా పార్క్ ను ఎంచుకున్నాడు. ఆ క్ర‌మంలో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మ‌ధ్య ఉద్రిక్త‌త చోటుచేసుకుంటోంది.

Also Read: క‌రెంట్ షాక్ కి గురైన త‌న బిడ్డ‌ను కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న ఏనుగు

ఇదంతా ముంద‌స్తు వేడి పుట్టించ‌డానికి కేసీఆర్ వేస్తోన్న ఎత్తుగ‌డ‌లుగా రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా. మోడీ స‌ర్కార్ మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను టీఆర్ఎస్ సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని చూస్తోంది. అధికారంలో ఉండి కూడా ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ముంద‌స్తు వ్యూహ‌మేన‌ని స్ప‌ష్టం అవుతోంది. కాంగ్రెస్ దూకుడుగా వెళితే, రాబోవు రోజుల్లో కేంద్రం మీద ఉన్న వ్య‌తిరేక ఓటు సాధార‌ణంగా కాంగ్రెస్ కు వెళుతుంది. అలాంటి ప‌రిస్థితి రాకుండా కేసీఆర్ వేస్తోన్న వ్యూహాల్లో భాగంగా ఢిల్లీ నుంచి తెలంగాణ వ‌ర‌కు బీజేపీని తాజా టార్గెట్ చేస్తున్నాడ‌ని టాక్‌.