Site icon HashtagU Telugu

CM KCR: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR

New Web Story Copy 2023 06 22t145926.082

CM KCR: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మితమైన ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. కాగా… తెలంగాణ ప్రభుత్వం దీనిని ‘ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ-నిధుల గృహ ప్రాజెక్ట్’గా భావిస్తుంది.

ఈ కాలనీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కెసిఆర్ గడ్డమీది రేణుక, హైసియా బేగం, ముదావత్ శారద, పుల్లిగాల దేవి, చాకలి సుజాత, కేతావత్ కీర్తిలకు ఇంటి పట్టాలను అందజేశారు. అనంతరం హౌసింగ్ ప్రాజెక్ట్ ఆవరణలో మొక్కలు నాటి, గృహ నిర్మాణాలు, వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటి రామారావు, టి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సిహెచ్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ.1489 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ కాలనీ 145 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ కాలనీలో 15,660 ఫ్లాట్‌ లు ఉన్నాయి. అంతేకాకుండా చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, పార్కు, పిల్లల కోసం అట స్థలం ఇలా అద్భుతంగ తీర్చిదిద్దారు. కాలనీలో మొత్తం 117 బ్లాకులున్నాయి. ఇందులో మొత్తంగా 15,660 కుటుంబాలు నివసించవచ్చు. నీటి సరఫరా సౌకర్యం మరియు విద్యుత్ సరఫరా కోసం 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్‌లోని ప్రతి అపార్ట్‌మెంట్‌లో సిసిటివిలతో కూడిన రెండు నాణ్యమైన లిఫ్టులు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

Read More: Hyderabad: ఐఐటీలో ర్యాంక్ సాధించిన అంబులెన్స్ డ్రైవర్ కొడుకు