KCR : 12 ఏళ్ల తర్వాత టీవీ డిబేట్ లో పాల్గొనబోతున్న కేసీఆర్ ..?

రేపు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 05:08 PM IST

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) దాదాపు 12 ఏళ్ల తర్వాత టీవీ డిబేట్ (TV Debate) లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ కు ఏమాత్రం కలిసిరావడం లేదు..ఏది మొదలుపెట్టిన రివర్స్ అవుతూ వస్తున్నాయి. ఓ పక్క కూతురు కవిత..ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉంది. నెల రోజులుగా బెయిల్ కోసం ట్రై చేస్తున్నప్పటికీ కోర్ట్ బెయిల్ ఇవ్వడం లేదు. ఇటు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదు. వరుస పెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు. ఎప్పుడు ఎవరు బై బై చెపుతారో అనేది అందరిలో టెన్షన్ గా ఉంది. ఎన్నికల్లో ఓడిన నేతలే కాదు గెలిచినా నేతలు సైతం పార్టీని వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో లోక్ సభ ఎన్నికలను కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుండి బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ కూడా ఖరారైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీవీ చర్చ లో పాల్గొనబోతున్నారు. రేపు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కరీంనగర్ వేదికగా జరిగిన కదనభేరీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే భూమి బద్దలైనట్లు కాంగ్రెస్ మాట్లాడుతోంది.. కాళేశ్వరం గురించి రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకు వచ్చి వివరిస్తానని కీలక ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత కేసీఆర్ ఎలాంటి చర్చ లోకి రాలేదు. కాగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ (TV9 Rajinikanth) తాజాగా చేసిన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘రేపు, తెలుగులో మహోన్నతమైన రాజకీయ ప్రముఖుడితో అతిపెద్ద, ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉండండి. మాతో ఎవరు చేరుతున్నారో మీరు ఊహించగలరా?’ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యాష్ ట్యాగ్ లు ఇచ్చారు. దీంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కేసీఆర్ కొందరు జగన్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మెజార్టీ నెటిజన్లు మాత్రం ఇంటర్వ్యూకు రాబోయో గెస్ట్ కేసీఆరేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం మలి దశ ఉధ్యమంలో ఆయన చివరగా ఆయన టీవీ9 కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పట్లో ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ అనంతరం సీఎంగా ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో పరిమామాలు సంతరించుకున్నారు. ఈ క్రమంలో తిరిగి అదే చానెల్ ద్వారా ప్రజల వద్దకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా కేసీఆర్ చర్చలో పాల్గొనబోతున్నారా లేదా అనేది చూడాలి.

Read Also : Obesity: పిల్లల్లో ఊబకాయం పెరగడానికి అసలు కారణమిదే.. అవేంటో తెలుసా