Congress Vs KCR : ‘‘ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్ ?’’.. కాంగ్రెస్ ట్వీట్

‘‘తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా’’ అంటూ  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

  • Written By:
  • Updated On - May 30, 2024 / 11:52 AM IST

Congress Vs KCR : ‘‘తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా’’ అంటూ  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ తాజాగా ఇవాళ ఉదయం ఓ ట్వీట్ చేసింది.  ‘‘అధికారం చేతిలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్  అన్ను మిన్ను కానకుండా ప్రవర్తించారు. అన్ని వ్యవస్థలను ముఖ్యంగా మీడియాను మేనేజ్ చేశారు’’ అని కాంగ్రెస్ మండిపడింది.

We’re now on WhatsApp. Click to Join

‘‘పదేండ్లు పబ్లిక్ పడే గోసని తొక్కి పెడితిరి.. ఇప్పుడు ప్రజాపాలన రాగానే బీఆర్ఎస్ పదేండ్ల పనితనం ఒక్కొక్కటిగా బట్టబయలైంది’’ అని హస్తం పార్టీ పేర్కొంది. ‘‘బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరంలో ఎటు చూసినా బొక్కలే కనిపిస్తున్నాయి. కేసీఆర్ చేసిన పదేండ్ల పాపాన్ని మా మీద రుద్దే దుర్మార్గానికి తెగబడుతున్నారు’’ అని కాంగ్రెస్ తెలిపింది. ‘‘బీఆర్ఎస్‌కు ఆ రోజులు మళ్ళీ రావు. మీ రాక్షస పాలనకు మళ్లీ అవకాశం దక్కదు. కారు మూలకు పడిందన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలా మీ గులాబీలకు?!’’ అని హస్తం పార్టీ(Congress Vs KCR)  చెప్పింది.

Also Read : Cracker Explosion : పూరీలో పేలుడు.. ముగ్గురు భక్తుల మృతి.. 30మందికి గాయాలు

విత్తనాల కోసం తెలంగాణ రైతులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతుల గోడును ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో మంత్రులు లెక్కలు తేల్చలేకపోతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేవాళ్లు లేరు.. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేవాళ్లు లేరు’ అని విమర్శించారు. సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలను ఎండబెట్టిన దుర్మార్గపు ప్రభుత్వమిది అని కేటీఆర్ మండిప్డడారు. ‘‘తెల్లవారుజామున 4 గంటలకు లైన్‌లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగలా సాగింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేశారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

Also Read :Courier Cheating : ‘కొరియర్’ పేరుతో కొల్లగొడతారు.. జాగ్రత్త సుమా !