KCR – Third Place : కామారెడ్డిలో మూడోస్థానంలో కేసీఆర్.. ముందంజలో రేవంత్

KCR - Third Place : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అనూహ్య ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - December 3, 2023 / 10:38 AM IST

KCR – Third Place : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అనూహ్య ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నాలుగు రౌండ్లు ముగిసే సమయానికి సీఎం కేసీఆర్ ఓట్లపరంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి  దాదాపు 3వేలకుపైగా ఓట్లతో ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి ఉన్నారు.  దీంతో అందరి చూపు కామారెడ్డి వైపే ఉంది. ఒకవేళ ఇక్కడ కేసీఆర్ ఓడిపోతే.. చాలా దశాబ్దాల గ్యాప్ తర్వాత ఆయనకు ఎదురైన ఓటమిగా ఇది నిలిచిపోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో దాదాపు  61వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో 22వేల ఓట్లు ముస్లిం వర్గానికి చెందినవే. ముస్లిం ఓట్లలో దాదాపు 70 శాతం కాంగ్రెస్‌కే పడ్డాయని భావిస్తున్నారు. ఇక మిగతా 40వేల ఓట్లలో దాదాపు 40 శాతం బీజేపీకి అనుకూలంగా పడ్డాయని అంచనా వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలే మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో జరిగిన గత మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇక్కడ పెద్దసంఖ్యలో బీజేపీ కౌన్సిలర్లు గెలిచారు.అందుకే ఇక్కడ బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు పోలవుతున్నాయి. కామారెడ్డి సెగ్మెంట్‌లోని మాచారెడ్డి, బిక్కనూరు, దోమకొండ మండలాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. ఇక కామారెడ్డి పట్టణంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రసవత్తర పోటీ  నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలలోగా కామారెడ్డి రిజల్ట్‌పై ఫుల్ క్లారిటీ(KCR – Third Place) రానుంది.

Also Read: Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్

ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలను చూస్తే బాన్సువాడలో బీఆర్ఎస్(పోచారం శ్రీనివాస్ రెడ్డి)  లీడ్‌లో ఉన్నాయి.  మిగతా 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ప్రతికూలమైన ట్రెండ్ కనిపిస్తోంది. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ 450 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గణేష్ గుప్తా, షకీల్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా వారివారి సెగ్మెంట్లలో వెనుకంజలో ఉన్నారు. ఆర్మూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ లీడ్ లో కొనసాగుతున్నారు.