తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు(KCR is silent on BJP) దూరంగా ఉంటున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడానికి భయపడుతున్నారు. గత రెండు వారాలుగా ఆయన వాయిస్ కాంగ్రెస్ మీదకు మళ్లింది. ఈనెల 23న జరిగే విపక్షాల మీటింగ్ కు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల బీజేపీ పార్టీ మీద ఒంటికాలు మీద లేచిన గులాబీ బాస్ నోరు ఆకస్మాత్తుగా పడిపోయింది. ఫాంహౌస్ ఫైల్స్ సందర్భంగా చేసిన హడావుడి నుంచి నరేంద్ర మోడీకి(Narendramodi) తలకాయలేదని వ్యక్తిగతంగా దూషించిన కేసీఆర్ ఇప్పుడు అవన్నీ మరచిపోయారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు(KCR is silent on BJP)
దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతోన్న వేళ కేసీఆర్ మొఖం(KCR is silent on BJP) చాటేశారు. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన విపక్షాల మీటింగ్ కు బీఆర్ఎస్ నుంచి ప్రతినిధులను పంపారు. రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసిన సందర్భంగా కూడా విపక్షాలతో బీఆర్ఎస్ కలిసింది. అధికారులు బదిలీలు, పోస్టింగ్ ల విషయంలో కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ ఇటీవల సీఎం కేజ్రీవాల్ కు మద్ధతుగా మోడీ సర్కార్ ను దుయ్యబట్టారు. ఇక అంతే, ఆ రోజు నుంచి కేసీఆర్ బీజేపీ మాట ఎత్తితే ఒట్టు. మాటల మాంత్రికుడు, రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ నోటిని బీజేపీ కట్టేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారమా? సహార, పాస్ పోర్ట్ తదితర కేసుల తవ్వకమా? అనేది తెలియదుగానీ, గులాబీ బాస్ మాత్రం కమలనాథుల జోలికి వెళ్లడానికి సాహసం చేయలేకపోతున్నారు.
ఎన్డీయేలో భాగస్వామ్యం కావడానికి చంద్రబాబు సిద్ధం
లోక్ సభ, త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu)గత వారం అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితుల దృష్ట్యా బీజేపీ, టీడీపీ పొత్తు ఉండేలా ఇరుపార్టీలకు చెందిన కొందరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఏపీలోని వైసీపీతో ఉన్న సహజ మిత్రత్వం కారణంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ వెనుకడుగు వేస్తోంది. ఎన్డీయేలో భాగస్వామ్యం కావడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. కానీ, వివిధ రాజకీయ సమీకరణాల దృష్ట్యా బీజేపీ పెద్దలు ఆచితూచి అడుగు వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వైసీపీ అన్ని రకాలుగా బీజేపీకి పార్లమెంట్ వేదికగా మద్ధతు ఇస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య రాజకీయ బంధం పెనవేసుకుంది. దాన్ని కాదని టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ మానసికంగా సిద్ధంగా లేదని తెలుస్తోంది.
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉండాలని పవన్
ప్రస్తుతం జనసేన, బీజేపీ మధ్య ఏపీ రాష్ట్రంలో పొత్తు ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో ఎవరికీ కనిపించదు. ఒక వేళ బీజేపీ కలిసి రాకపోతే, టీడీపీతో పొత్తుపెట్టుకోవడానికి జనసేన సిద్ధంగా ఉందని వినికిడి. ఇలాంటి పరిస్థితుల్లో 2019 తరహాలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉండాలని పవన్ తొలి ఆప్షన్ కింద పెట్టుకున్నారు. అదే విషయాన్ని బీజేపీ పెద్దలకు కూడా వివరించారు. ఆ క్రమంలోనే అమిత్ షా, నడ్డాతో ఇటీవల చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణ వరకు పరోక్షంగా టీడీపీ మద్ధతు తీసుకుని ఏపీలో దూరంగా ఉండాలని బీజేపీలోని కొందరు భావిస్తున్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా చేరడానికి చంద్రబాబు దూకుడుగా వెళుతున్నప్పటికీ ఢిల్లీ బీజేపీ ఆలోచిస్తోంది.
Also Read : Political king pin : BRS, కాంగ్రెస్ జాతకాలను మార్చనున్న MIM
రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కో ఎన్నికకు ఒక్కోలా ఉంటాయని అందరికీ తెలిసిందే. లోక్ సభకు జరిగిన 2019 ఎన్నికల వ్యూహానికి భిన్నంగా 2024 ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆ క్రమంలో ఎన్డీయేకి దూరమైన జేడీయూ, అకాలీదళ్, శివసేన బదులుగా ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంది. బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లోని జేడీయూ, జేడీఎస్ పార్టీలను కలుపుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే స్వల్పకాలిక పొత్తు కోసం కర్ణాటక రాష్ట్రంలోని జేడీఎస్ తహతహలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైన జేడీఎస్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి నడవాలని భావిస్తోంది. ఇక ఆర్జేడీతో సంబంధాలు బలహీనపడితే, జేడీయూను మరోసారి కలుపుకుని వెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారు.
Also Read : CM KCR : మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. సింగరేణి కార్మికులపై వరాల జల్లు
మూడోసారి ఢిల్లీ పీఠం కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాలు, యూపీఏ బలోపేతం కావడం తదితరాలను గమనిస్తోంది. కర్ణాటక ఎన్నికల తరువాత యూపీఏ మద్ధతు 114 నుంచి 144 వరకు పెరిగింది. ఆ దృష్ట్యా ఎన్డీయేలోకి కొత్త భాగస్వాములను ఆహ్వానించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అయితే, తెలంగాణ , ఏపీ రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ పరోక్షంగా బీజేపీకి మద్ధతు పలికేవిగా ఉన్నాయి. వాటిని భాగస్వామిగా తీసుకోనప్పటికీ బీజేపీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. ఒక్క మాట కూడా బీజేపీ, మోడీ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడవు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ సంయుక్తంగా బీజేపీ అభ్యర్థికి మద్ధతు పలికాయి.
తెలంగాణ దాటి వెళ్లలేక, బీజేపీ పంచన సలాం (KCR is silent on BJP)
అప్కా బార్ కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళతానని ఊకదంపుడు ప్రసంగాలు కేసీఆర్ చేశారు. మహారాష్ట్రలో సభలు నిర్వహించడం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ మోడల్ ప్రచారానికి ఖర్చు పెట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ దాటి వెళ్లలేక, బీజేపీ పంచన సలాం (KCR is silent on BJP) కొడుతున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా బీజేపీ మీద మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఇక గులాబీ బాస్ మార్గంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు గప్ చిప్ గా ఉండడం విచిత్రం.
Also Read : Sharmila strategy : BRS, కాంగ్రెస్ పొత్తుపై షర్మిల, KCR కు దశ ప్రశ్నలు!