Site icon HashtagU Telugu

KCR Health : కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీసిన సీఎం రేవంత్

Revanth Ckcr

Revanth Ckcr

తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..నిన్న అర్ధరాత్రి తన ఫేమహౌస్ లో కాలుజారీ పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తుంటి ఎముక రెండు చోట్ల విరిగింది. ప్రస్తుతం ఆయనకు సోమాజిగూడ యశోద హాస్పటల్ (Yashoda Hospital) లో మేజర్ సర్జరీ చేస్తున్నారు. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని డాక్టర్స్ చెపుతున్నారు.

ఇక కేసీఆర్ హాస్పటల్ లో చేరిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నేతలు , పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున యశోదకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాస్పటల్ వద్ద భద్రత పెంచాలని, అలాగే కేసీఆర్ ఆరోగ్యం (KCR Health Condition) ఫై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ..మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుతం కేసీఆర్‌ వద్ద ఆయన సతీమణి శోభ, ఎంపీ సంతోశ్‌ కుమార్‌ ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేతను మాజీ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి పరామర్శించారు. అయితే కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. త్వరలోనే కోలుకుంటారన్నారు. కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రధాని మోడీ (PM Modi) సైతం కేసీఆర్ ఆరోగ్యం ఫై స్పందించారు. కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Read Also : Akbaruddin Owaisi : రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్..?