Telangana: కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంటులో 15వేల కోట్లు నొక్కేసిన కేసీఆర్: రేవంత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలోంచలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంటులో సీఎం కెసిఆర్ అవినీతి చేసినట్టు ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలోంచలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంటులో సీఎం కెసిఆర్ అవినీతి చేసినట్టు ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. పాలోంచ (800 మెగావాట్లు)లో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు – కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (స్టేజ్ II) ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడం ద్వారా కెసిఆర్ సుమారు 15,000 కోట్ల రూపాయలను కమీషన్‌గా దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.45,730 కోట్లతో మణుగూరులో థర్మల్ పవర్ స్టేషన్ (1080 మెగావాట్లు), యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ దామరచర్లలో (5×800 మెగావాట్లు) చేపట్టారు. దీనిపై రేవంత్ అధికార పార్టీపై ఆరోపణలు గుప్పించారు. విద్యుత్‌ను ఉత్పత్తి విషయంలో తెలంగాణ కంటే పొరుగున్న ఉన్న జార్ఖండ్ తక్కువ వ్యయంతో సాధించిందని రేవంత్ అన్నారు.

Also Read: Telangana: అన్నం పెట్టే రైతన్నను మోసం చేసిన పాపం కేసీఆర్‌దే

ఒక మెగావాట్ థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు కెసిఆర్ ప్రభుత్వం రూ.9.7 కోట్లు వెచ్చించగా, జార్ఖండ్ కేవలం రూ.5.5 కోట్లు వెచ్చించిందని ఆయన అన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రము తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ చెప్పిన లెక్కల విషయాన్ని వస్తే కొత్తగూడెం పవర్ ప్లాంట్‌లో రూ.945 కోట్లు, భద్రాద్రి ప్లాంట్‌లో రూ.4,538 కోట్లు, యాదాద్రిలో రూ.9,384 కోట్లు నష్టపోయినట్టు పేర్కొన్నారు. ఈ మొత్తంలో సీఎం కెసిఆర్ 15 వేల కోట్లు లాభపడ్డారని ఆరోపించారు. అయితే ఇవేవో ఆరోపణలు కాదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంఘం నివేదికలో వెల్లడైన విషయాలేనని స్పష్టం చేశారు రేవంత్.

Also Read: Food Poisoning: ఎగ్ బిర్యానీ తిని 32 మంది విద్యార్థినులకు అస్వస్థత