Site icon HashtagU Telugu

KCR : చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి ఫై కేసీఆర్ ప్రశ్నల వర్షం

Kcr Ranjeeth

Kcr Ranjeeth

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి (Chevella Congress MP Candidate Dr Ranjith Reddy) ఫై బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆగ్రహం వ్యక్తం చేసారు. బిఆర్ఎస్ పార్టీ లో రంజిత్‌ రెడ్డికి ఏం తక్కువ చేసాం..? ఎంపీ టికెట్‌ ఇవ్వలేదా? గౌరవం ఇవ్వలేదా? ఆయనెందుకు పార్టీ మారిండు..? అధికారం కోసమా? పదవుల కోసమా? పైరవీల కోసమా? ఆయన ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు తిరుగుతడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలంటూ చేవెళ్ల సభ వేదికగా కేసీఆర్ డిమాండ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..ఇప్పుడు లోక్ సభ (Lok Sabha) ఎన్నికలతో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు చేవెళ్ల (Chevella ) వేదికగా ప్రజా ఆశీర్వాద సభ ఏర్పటు చేసారు. ఈ సభ వేదికగా కాంగ్రెస్ , బిజెపి లపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయయ్యాయి అని నిలదీశారు. ఈ దేశంలో బీజేపీ ప‌దేండ్ల నుంచి అధికారంలో ఉంది. భావోద్వేగాలు పెండ‌చం త‌ప్ప, మ‌త‌పిచ్చి లేప‌డం త‌ప్ప, ఏద‌న్న మంచి ప‌ని జ‌రిగిందా..? పెట్రోల్ ధ‌ర ఏంది.. డిజీల్ ధ‌ర ఏంది..? దేశంలో ఏం జ‌రుగుతంది. మా పార్టీలో జాయిన్ అవుతావా లేదా జైలుకు పోతావా..? అయితే మోడీ.. త‌ప్పిడే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజ‌కీయం..? ఇదేనా దేశాన్ని ముంద‌కు తీసుకుపోయే ప‌ద్ధ‌తి..? ఇదేనా ప్ర‌జాస్వామ్యాన్ని ఎక్క‌డిక‌క్క‌డ పాత‌రేసే ప‌ద్ధ‌తి..? అంటూ కేంద్రంలోని బీజేపీ పార్టీ ఫై విమర్శల వర్షం కురిపించారు.

ఇదే సందర్బంగా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌ రెడ్డికి వరుస ప్రశ్నలు సంధించారు. రంజిత్‌ రెడ్డికి బిఆర్ఎస్ ఎంపీ టికెట్‌ ఇవ్వలేదా? గౌరవం ఇవ్వలేదా? ఆయనెందుకు పార్టీ మారిండు ..ఆయన ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు తిరుగుతడా? ఆయన ఎందుకు కాంగ్రెస్‌లోకి వెళ్లిండు.. అధికారం కోసమా? పదవుల కోసమా? పైరవీల కోసమా? సమాధానం చెప్పాలని నిలదీశారు. మరి కేసీఆర్ వ్యాఖ్యలపై రంజిత్‌ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also : Danam Land Grab: దానం భూకబ్జా వెనుక సీఎం రేవంత్: కేటీఆర్