గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ పార్టీ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ , బిజెపి పార్టీలలో చేరారు..మరికొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)..పార్టీ మారిన నేతలపై కీలక వ్యాఖ్యలు చేసారు.
నేడు ఆదివారం కేసీఆర్ (KCR) పొలంబాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు, కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. పర్యటన అనంతరం సూర్యాపేట జిల్లాలో ఏర్పటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..పార్టీ మారిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పార్టీ నేతలను కాంగ్రెస్, బీజేపీలో చేర్చుకోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కుక్కల్ని, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్. రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలు ఏం కావాలి? రాజకీయాలు చేయడానికి మేము రెడీ. చాలా మందిని పాతరేశాం’ అని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రారంభించగానే పవర్ పోయింది.ఆ తర్వాత కొద్దిసేపటికే కరెంటు రావడంతో.. ఇట్ల కరెంటు పోతా.. వస్త ఉంటది అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ అన్న మాట వినగానే సభ నవ్వులతో నిండిపోయింది. కరెంటు కోతలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అని కేసీఆర్ అన్నారు.
Read Also : NTR: ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిని ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా!