KCR : ఆలోచన మార్చుకున్న కేసీఆర్..

పదేళ్ల పాటు వారికీ కీలక పదవులు కట్టబెట్టి..వారి చెప్పిందల్లా వినుకుంటూ..వారికీ కావాల్సిన నేతలకు పనులు అప్పగిస్తూ ఎంతో చక్కగా చూసుకున్న..ఈరోజు కేసీఆర్ వద్దంటూ వెళ్లిపోయారు

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 08:46 AM IST

కాలం ఎప్పటికి ఒకేలా ఉండదు..ఎన్ని యాగాలు చేసిన , పూజలు చేసిన ఒక్కోసారి దేవుడి ఆశీస్సులు మనపై ఉండవు..ఆ సమయంలో ఏదో జరగాలో అదే జరుగుతుంది..ప్రస్తుతం బిఆర్ఎస్ అధినేత, కేసీఆర్ (KCR) పరిస్థితి అలాగే ఉంది. పదేళ్ల పాటు ఆయన ఆడిందే ఆట..పాడిందే పాటలా సాగింది. కానీ ఒక్కసారి అధికారం పోయేసరికి అంత రివర్స్ అయ్యింది. అధికారం ఉన్నప్పుడే మనవెంట..అధికారం లేకపోతే ఎవరు ఉండరని స్పష్టంగా అర్థమైంది. మొన్నటి వరకు కేసీఆరే మా దేవుడు..ఆయన మాటను కాదనం అంటూ చెప్పిన నేతలు..ఈరోజు కేసీఆర్ ను కాదని పక్క పార్టీల్లోకి వెళ్లిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

పదేళ్ల పాటు వారికీ కీలక పదవులు కట్టబెట్టి..వారి చెప్పిందల్లా వినుకుంటూ..వారికీ కావాల్సిన నేతలకు పనులు అప్పగిస్తూ ఎంతో చక్కగా చూసుకున్న..ఈరోజు కేసీఆర్ వద్దంటూ వెళ్లిపోయారు. దీంతో కేసీఆర్ ఙానోదయం అయ్యింది. పార్టీలో కీలక నేతలే కాదు..కింది స్థాయి నేతలు కూడా అవసరమే అని తెలుసుకున్నాడు. అందుకే ఇప్పుడు కిందిస్థాయి నేతలు ఎవరు..? వారు నియోజకవర్గంలో..మండలస్థాయి..గ్రామస్థాయి లో పార్టీ కోసం ఎంత శ్రమిస్తున్నారు..? ప్రజల్లో వారిపై ఉన్న నమ్మకం ఎలాంటిది..? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.

అధికారంలో ఉన్నప్పుడు కిందిస్థాయి నేతలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలే…ఆ బాధ్యతంతా ఎమ్మెల్యేలకే అప్పజెప్పాడు. దీంతో వారు వారికీ కావాల్సిన నేతలనే దగ్గర తీసుకున్నారు తప్ప పార్టీ కోసం పనిచేసే వారిని దగ్గరికి తీసుకోలే. దీంతో వారంతా ఇంత చేసిన పార్టీలో స్థానం లేదని చెప్పి..కాంగ్రెస్ లోకి చేరుతూ వచ్చారు. ఇదే ఇప్పుడు బిఆర్ఎస్ కు పెద్ద మైనస్ అయ్యింది. ఎంతసేపు ఎమ్మెల్యేల బాగోగులు చూసుకున్నాడు తప్ప..కిందిస్థాయి నేతలను పట్టించుకోకపోయేసరికి ..ఇప్పుడు బిఆర్ఎస్ కు కిందిస్థాయి నేతలంతా లేకుండా పోయారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ పార్టీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

లోక్ సభ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించేందుకు రోడ్డుషోలను ఈ నెల 24 నుంచి స్టార్ట్ చేసిన ఆయన.. రోడ్డుషో తర్వాత ఆయా జిల్లా కేంద్రాల్లోనే బస చేస్తూ ఆ ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు నేతలకు సూచనలు చేస్తూ వస్తున్నారు. గతానికి భిన్నంగా నేతలందరితో మాట్లాడటంతో పాటు ఉదయం ఆయా వర్గాలకు చెందిన ప్రజలతో భేటీ అవుతూ సమస్యలు తెలుసుకుంటూ పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులపై దురుసు ప్రవర్తన, భూకబ్జా, సెటిల్ మెంట్లు చేస్తున్నారనే పిర్యాదులు వస్తుండడం తో వారందరిని సున్నితంగా మందలిస్తూ.. తీరు మార్చుకోవాలని, గతంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా ప్రజాసమస్యలపై దృష్టిసారించాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ద్వారా మరోసారి తమ పార్టీ సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నాడు.

Read Also : Onion : 1 నెల పాటు ఉల్లిపాయ తినకపోతే, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?