Telangana: తెలంగాణలో ప్రజారాజ్యం: రాహుల్ గాంధీ

వచ్చే ఎన్నికలు దొరలు, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు . ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములను బీఆర్‌ఎస్ నేతలు లాక్కున్నారని ఆరోపించారు.

Telangana: వచ్చే ఎన్నికలు దొరలు, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు . ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములను బీఆర్‌ఎస్ నేతలు లాక్కున్నారని ఆరోపించారు. పదేళ్ల పాలనలో పేద ప్రజల అభ్యున్నతికి ఏం చేశారో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.ప్రజల్లో ఉన్న పేదరికాన్ని పారద్రోలే పనికి బదులు కేసీఆర్, ఆయన కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు, బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం బారులు తీరుతున్నారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పేపర్ల లీక్ వల్ల యువత నష్టపోయింది. ప్రధాని మోదీ, కేసీఆర్‌లు కలిసి ప్రజల జేబులోంచి దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు హామీలను అమలు చేసి ప్రజారాజ్యం చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు . తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదిస్తాం. మహిళలకు రూ.5కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆదుకుంటామని రాహుల్ చెప్పారు.

Also Read: Gujarat Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. 20 మంది మృతి