Site icon HashtagU Telugu

KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్‌.. మోడీ బడే భాయ్‌: కేసీఆర్

KCR Bus Yatra

KCR Bus Yatra

KCR Bus Yatra: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌పై విషం చిమ్మడం, ఓట్ల కోసం మరోసారి ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరేమీ చేయడం లేదన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని బలపరచాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

మహబూబ్‌నగర్‌లో జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడుతూ… మహబూబ్‌నగర్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉందన్నారు. ఇందులో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రధాన పోటీలో ఉన్నాయని, కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానంలో ఉందని చెప్పారు. అయితే బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందే అవకాశం లేదన్నారు కేసీఆర్. పాలమూరు ప్రాంత అభివృద్ధికి ఆమె చేసిందేమీ లేదని అన్నారు. గడచిన 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. మోదీ ఈ ప్రాంత ప్రజలకు అత్యంత అన్యాయం చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయలేదని, వరి సేకరణలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించిందని ఫైర్ ఆయాయ్రు ఆయన.

We’re now on WhatsAppClick to Join

మోడీ ప్రభుత్వం 7 మండలాలను తెలంగాణా నుండి లాక్కొని ఆంధ్రాకి ఇచ్చిందని గుర్తు చేశారు కేసీఆర్. అంతేకాకుండా 400MW పవర్ ప్లాంట్‌ని లాక్కొని ఆంధ్ర ప్రదేశ్ కి ఇచ్చింది. నాటి కాంగ్రెస్‌లో ఉన్న మంత్రి డీకే అరుణ తెలంగాణ వాటా నీటిని లాక్కోవాలని ఆంధ్రా నాయకులను వదిలి ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై అప్పట్లో విషం చిమ్మి ఇప్పుడు సిగ్గులేకుండా ఓట్లు అడుక్కుంటున్నారని విమర్శించారు. 9 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మనం శాంతియుతంగా జీవించామని, ఎలాంటి మత హింసాకాండ జరగలేదని ముస్లిం సోదరులు గుర్తుంచుకోవాలి. కానీ బీజేపీ పార్టీకి ఓటేస్తే మతతత్వ శక్తులు గెలిచే ప్రమాదం ఉంది. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయండి’ అని మహబూబ్‌నగర్‌లో జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ అన్నారు.

Also Read: KCR Bus With Lift: కేసీఆర్ బస్సుకు లిఫ్ట్.. డిజైన్ మాములుగా లేదుగా..