BRS Campaign : కాంగ్రెస్‌ వస్తే దళారుల రాజ్యమే – కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం

  • Written By:
  • Publish Date - November 26, 2023 / 03:20 PM IST

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొద్దీ రోజులుగా విశ్రాంతి లేకుండా వరుసగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (KCR) ..ఈరోజు ఖానాపూర్‌ (Khanapur) లో పర్యటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఫై విమర్శల వర్షం కురిపించారు.

‘ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఏ అభ్యర్థికి ఓటేస్తే మంచి జరుగుతది..? ఏ పార్టీ మంచిగ పనిచేస్తది..? అనేది ఆలోచించి ఓటేయాలె. అప్పుడే మనకు మంచి జరుగుతది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న ఓకే ఒక్క వజ్రాయుధం ఓటు. ఆ ఓటు హక్కును మనం సరిగ్గా వినియోగించుకుంటేనే మనకు మంచి జరుగుతది. అందుకే బాగా ఆలోచించి ఓటేయండి. ఓటేసేటప్పుడు పార్టీల చరిత్రను చూడండి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం. కాంగ్రెస్‌ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ప్రాణాలు పణంగా పెట్టి 15 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణ ను కాంగ్రెస్ చేతిలో పెడితే దళారుల రాజ్యమే అవుతుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉన్నది. ఆ 50 ఏండ్ల కాలంలో ప్రజల కోసం కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదు. రాష్ట్రమంతా కరువు కాటకాలు ఉండేవి. ప్రజా సంక్షేమం సరిగ్గా జరగలే. అదిగాక ఉన్న తెలంగాణను ఆంధ్రాతో కలిపి అన్యాయం చేశారు. మళ్ల మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవడానికి 58 ఏండ్లు పట్టింది. చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తేగానీ తెలంగాణ సాధ్యంగాలే. కాబట్టి ఓటు వేసేటప్పుడు మీరు బాగా ఆలోచించాలె. పార్టీల చరిత్రను బేరిజు వేసుకుని ఓటేయాలి. ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతది అనేదానిపై మీ గ్రామాల్లో, తండాల్లో చర్చ జరగాలె. అప్పుడే రాయేదో.. రత్నమేదో తేల్తది. మంచి సర్కారు ఏర్పాటైతది’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Read Also : Hyderabad: ఆదిబట్ల సమీపంలో కారులో వ్యక్తి సజీవ దహనం