KCR Big Shock To MLC Kavitha : కూతురికి టికెట్ ఇవ్వని కేసీఆర్..కారణం అదేనా..?

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR)..తన సొంత కూతురికి (Kavitha) షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న కేసీఆర్ ఈరోజు కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో కవిత పోటీ చేస్తుందని అనుకున్న స్థానంలో మరొకర్ని ప్రకటించి కవిత కే కాదు పార్టీ శ్రేణులకు సైతం షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha […]

Published By: HashtagU Telugu Desk
Kcr Shock To Kavitha

Kcr Shock To Kavitha

బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR)..తన సొంత కూతురికి (Kavitha) షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న కేసీఆర్ ఈరోజు కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో కవిత పోటీ చేస్తుందని అనుకున్న స్థానంలో మరొకర్ని ప్రకటించి కవిత కే కాదు పార్టీ శ్రేణులకు సైతం షాక్ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..ఈరోజు బుధువారం మరో నలుగుర్ని ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

మొదటి జాబితాలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించగా..ఈరోజు మరో నలుగుర్నిఅభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.

వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ , జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్దన్‌ను నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా గతంలో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే.

ఈసారి ఆమెకే ఇస్తారని అనుకున్నారు కానీ కేసీఆర్ మాత్రం బాజిరెడ్డి కి ఇచ్చారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. బాజిరెడ్డి కి టికెట్ ఇవ్వకపోతే పార్టీ ని వీడే అవకాశాలు ఎక్కువ ఉండడం ఒక కారణమైతే..రెండోది కేసీఆర్ తన ఫ్యామిలీ కే టికెట్ ఇచ్చారనే విమర్శలు రాకుండా ఉండేదుకు టికెట్ ఇవ్వలేదని అనుకోవచ్చు. ఎందుకంటే బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ , వినోద్ , హరీష్ రావు , కవిత ఇలా తన ఫ్యామిలీ నుండే నలుగురికి టికెట్లు ఇచ్చారని , కీలక పదవులు కూడా కట్టబెట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసాయి. ఈ ఆరోపణలు కూడా బిఆర్ఎస్ ఓటమికి కారణం అయ్యాయి. అందుకే ఈసారి అలాంటి విమర్శలు , ఆరోపణలు రాకుండా కేసీఆర్ చూసుకుంటున్నారు.

Read Also : Yanamala Krishnudu : టీడీపీ భారీ షాక్…వైసీపీ లో యనమల ..?

  Last Updated: 13 Mar 2024, 09:43 PM IST