Site icon HashtagU Telugu

KCR : నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోస్తూ.. చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసినోడు..ఈరోజు నన్ను తిడుతున్నాడు – కేసీఆర్

Kcr Revanth

Kcr Revanth

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign) చివరి స్థాయికి చేరుతుండడం తో అధికార పార్టీ బాస్ , సీఎం కేసీఆర్ (CM KCR) తన ప్రసంగాలలో పదునైన మాటలతో ప్రత్యర్థుల ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫై అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు జ‌న‌గామలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొన్న కేసీఆర్ … నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోస్తూ.. చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసినోడు..ఈరోజు నన్ను తిడుతున్నాడు అంటూ రేవంత్ ఫై మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

‘కర్ణాటక లో కరెంటును కాటకలిపిన కాంగ్రెస్‌.. తెలంగాణలోనూ కాటకలుపుతది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలోను 24 గంటల కరెంటు లేదు. ఏ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో లేదు. కానీ తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కేసీఆర్‌ జగమొండి కాబట్టి.. ఏం చేసినా మా రైతులను కాపాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సప్లయ్‌ చేస్తున్నాం అని అన్నారు.

అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై కూడా సీఎం కేసీఆర్ ఘాటైన విమర్శలు చేసారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్‌ను తిడుతున్నాడు.. ఇది మ‌ర్యాదానా..? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్‌కు పిండం పెడుతా అంట‌డు. ఎవ‌రికి పిండం పెట్టాల్నో మీరు నిర్ణ‌యించాలి. ఇది మ‌ర్యాదానా..? ఇది రాజ‌కీయం అంటారా..? స‌భ పెట్టుకుని నీ పార్టీ పాల‌సీ చెప్పుకో. గెలిచేటోడు చేస్త‌డా.. ఈ ప‌ని, డిపాజిట్లు పోయి ఓడిపోతామ‌ని భ‌య‌ప‌డేటోడే ఈ మొరుగుడు మొరుగుత‌రు అంతే క‌దా. తిట్టాలంటే ఈ దేశంలో తిట్లు క‌రువు ఉన్నాయా..? మ‌న‌కు తిట్ట‌రాదా..? ఇయ్యాల మొద‌లు పెడితే రేప‌టి దాకా తిట్టొచ్చు. మ‌నం ఆపని చేస్త‌లేం. మ‌న విష‌యం చెప్పుకుంటున్నాం. ద‌య‌చేసి మీరంద‌రూ ఆలోచించి ఓటేయాల‌ని కేసీఆర్ కోరారు.

Read Also : Telangana Election 2023- BJP Manifesto : ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో బిజెపి మేనిఫెస్టో విడుదల