Site icon HashtagU Telugu

BRS MLC’s: కేసీఆర్ అనౌన్స్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే!

CM kcr and telangana

CM KCR Telangana

రాష్ట్ర శాసన మండలి (BRS MLC’s) కి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి లను బిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సిఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

కాగా… రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ (Governor) ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. ఈ నెల తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కె. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామి రెడ్డి. సమర్పించనున్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలో ఖాళీ అవుతున్న 10 స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 10 మంది శాసనమండలి సభ్యుల పదవీకాలం.. ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో… ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 7 శాసనమండలి స్థానాలకు.. తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Narayana CPI: జగన్ ను పారిశ్రామికవేత్తలు నమ్మే పరిస్థితి లేదు!