Site icon HashtagU Telugu

Medigadda Pillar Damage : మేడిగడ్డ పిల్లర్ డ్యామేజ్ పై నోరు విప్పిన కేసీఆర్

Medigadda Pillar Damage Kcr

Medigadda Pillar Damage Kcr

గత బిఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project). జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై దీనిని నిర్మించారు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యంగా నిర్మించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో అనేక అవకతవకలు జరిగాయని..ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ వేలాది కోట్లు కాజేశారని..మేడిగడ్డ బ్యారేజిలోని రెండు పిల్లర్లు కుంగియని (Medigadda Pillar Damage)..ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూలడానికి సిద్ధం గా ఉందని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ..దీనిపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

దాదాపు 12 ఏళ్ల తర్వాత కేసీఆర్ (KCR) టీవీ చర్చలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై సమాదానాలు చెప్పుకొచ్చారు. మా హయాంలో కట్టిన అన్ని ప్రాజెక్ట్ బాగానే ఉన్నాయి..కాకపోతే మేడిగడ్డ బ్యారేజిలోని ఏడో బ్లాక్‌లో 10 పిల్లర్లు ఉన్నాయి. వాటిలో రెండు పిల్లర్లు కొంచెం ఎక్కువ, మూడో పిల్లర్‌ కొంత కుంగింది. పిల్లర్లు ఎందుకు కుంగినయ్‌.. ఏమైందని అక్కడి అధికారులను అడిగితే జరిగింది చెప్పారని కేసీఆర్‌ తెలిపారు. ‘ అంతకుముందు సంవత్సరం 28 లక్షల క్యూసెక్కుల భయంకరమైన వరద వచ్చింది. అప్పుడే కన్నెపల్లి పంప్‌హౌజ్‌ మునిగింది. దాన్ని రిపేర్‌ చేసుకున్నాం. ఆఫ్‌లైన్‌ ఎప్పటికప్పుడు సరి చేయాలి. వీటికోసమే ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం ఈఎన్‌సీ పోస్టు క్రియేట్‌ చేసి నాగేందర్‌కు బాధ్యతలు అప్పగించాం. అక్కడ ఉండే సీఈ ఆ మెయింటెన్‌ చేయాలి. దాన్ని సర్దాలి. కానీ అది సర్దకపోవడంతో దాని కింద ఉన్న ఇసుక కుంగి కొంచెం క్రాక్‌ వచ్చింది. దాన్ని కాంగ్రెస్ వాళ్లు మామీద ఆరోపణలు చేస్తూ..నీటిని వదలకుండా చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బలి చేస్తామంటే ఎలా ఊరుకుంటాం.. టన్నెల్స్‌కు ఏమైనా అయ్యిందా? కాల్వలకు ఏమైనా అయ్యిందా? పంప్‌హౌస్‌లకు ఏమైనా అయ్యిందా? బ్యారేజిలకు ఏమైంది? అక్కడ ఎంత వెర్రి చేతలు.. అక్కడ గ్రౌటింగ్‌ ప్రతి సంవత్సరం చేయాలి. నదుల మీద ఉండే బ్యారేజిలు, రిజర్వాయర్లకు ఎప్పటికప్పుడు మెయింటైన్‌ చేస్తూనే ఉండాలి. ఆ మెయింటెనెన్స్‌ నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టు లేచి పోతుందన్నారు.’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసలు నీటిని ఎలా తీసుకోవాలో ఈ కాంగ్రెస్‌ వాళ్లకు అర్థం కాక మా మీద విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం స్టోరేజీ కెపాసిటీ 16 టీఎంసీలేనని అన్నారు. మేడిగడ్డలో 80కిపైగా గేట్లు ఉన్నాయన్నారు. ఎండాకాలంలో రెండో పంటకు, సాగునీటికి కాళేశ్వరం ఎంతో కీలకమన్నారు. 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టామని, ప్రాజెక్టుకు 200 టన్నెల్స్‌ క్షేమంగానే ఉన్నాయన్నారు. కాళేశ్వరంలో పంప్‌హౌస్‌లు, టన్నెల్స్‌ అన్ని బాగున్నాయన్నారు. మేడిగడ్డ 3 పిల్లర్లలో ఒక్క బ్లాక్‌లో ఇబ్బందిని పెద్దగా చూపిస్తున్నారన్నారు. ఎవరు అడ్డం వచ్చినా కాళేశ్వరం రిపేరు చేయిస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. కాళేశ్వరానికి ఏమీ కాలేదని ప్రజలకు అర్థమైందని… నామీద కోపంతోనే కాంగ్రెస్‌ వాళ్లు రైతుల పొలాలు ఎండబెట్టారన్నారు. కోమటిరెడ్డి కంపెనీ కట్టిన మిడ్‌మానేరు కట్ట ఒక్కవానకే కొట్టుకుపోయింది..దానికి మీము ఏమి అనలేదు కదా..అప్పుడప్పుడు
నదులపై కట్టి మెగా ప్రాజెక్టుల్లో కొన్ని లోపాలు అనేది సహజమన్నారు.

Read Also : Telangana : పదేళ్ల పాటు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇచ్చాం – కేసీఆర్