Site icon HashtagU Telugu

Kavitha : ఢీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

MLC Kavitha

MLC Kavitha

BRS MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌ పాలసీ..సీబీఐ కేసులో దాఖలు చేసిన ఢీఫాల్ట్‌ బెయిల్‌ (Default bail) పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇదే పిటిషన్‌పై సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ తన తరుఫున వాదించే సీనియర్‌ న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మరో రోజు విచారణ చేపట్టాలని కోరారు. కానీ అనూహ్యంగా ఈ రోజు పిటిషన్‌ను వెనక్కితీసుకున్నారు. అయితే పిటిషన్‌ విత్‌డ్రాలో కవిత బెయిల్‌ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం సుప్రీం కోర్టును ఆశ్రయించి.. అక్కడి నుంచి బెయిల్‌ పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రౌస్‌ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు మద్యం పాలసీ కేసులో సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌ కావాలని కోరుతూ కవిత రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్‌ తిరస్కరించింది. విచారణ సమయంలో కవితకు బెయిల్‌ ఇవ్వకూడదని దర్యాప్తు సంస్థలు కోర్టులో తమ వాదనలు వినిపించాయి. ఆమె ప్రభావవంతమైన వ్యక్తి కాబట్టి సాక్ష్యాలు,సాక్ష్యుల‍్ని తారుమారు అయ్యే అవకాశం ఉందని, బెయిల్‌ ఇవ్వొద్దని తెలిపాయి. ఈ అంశాలను పరిణగలోకి తీసుకున్న కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.

Read Also: Wayanad Landslides : తల్లి ప్రేమకు చాటిలేదు అని నిరూపించిన కోతి

ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కవితకు చుక్కెదురైంది. దీంతో న్యాయ బద్దంగా బెయిల్‌ పొందేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. సీబీఐ ఛార్జ్‌ షీట్‌లో తప్పులు ఉన్నాయని జులై 6న కవిత దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆ ఛార్జ్‌షీట్‌లో తప్పులు లేవని సీబీఐ తరుఫు లాయర్లు కోర్టులో వాదించారు. ఇప్పటికే సీబీఐ ఛార్జ్‌ షీట్‌ను జులై 22న పరిగణలోకి కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జగింది.

విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు న్యాయవాది రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజాకు విన్నవించారు. దాంతో న్యాయమూర్తి ఈ కేసును చివరిసారి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. బుధవారం విచారణ సమయంలో వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని న్యాయవాదికి సూచించారు. ఈ కేసు విచారణ ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. ఆగస్ట్‌ 9కి వాయిదా వేశారు. రేపు కోర్టులో విచారణ జరగనుండగా.. అనూహ్యంగా డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు.

Read Also: Bangladesh : బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం..ప్రధానిగా ముహమ్మద్‌ యూనస్‌..!