Kavitha : 10 రోజుల పాటు కవిత అక్కడే..

ఈరోజు కవిత ఎర్రవెల్లి ఫామస్ కు వెళ్లిన ఆమె తండ్రిని కలిసి ఆయన పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Kavitha Kcr Farmhouse

Kavitha Kcr Farmhouse

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam Case)లో బెయిల్ ఫై విడుదలైన కవిత..తన తండ్రి కేసీఆర్ ను కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో ఈడీ అధికారులు కవిత(BRS MLC Kavitha)ను మార్చి 15న అరెస్ట్​ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. బెయిల్ ఫై విడుదలై హైదరాబాద్ కు చేరుకున్న కవిత కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బంజారాహిల్స్ లోని తన ఇంటి వరకు భారీగా కార్ ర్యాలీ తో స్వాగతం పలికారు. చాలారోజుల తర్వాత ఆమెను చూసిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు, జాగృతి నాయకులు, మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. ఇంట్లోకి రాగానే కవిత ముందుగా పూజగదిలో దేవుడికి సాష్ఠాంగ నమస్కారం చేసి తల్లి శోభమ్మకు పాదాభివందనం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈరోజు కవిత ఎర్రవెల్లి ఫామస్ కు వెళ్లిన ఆమె తండ్రిని కలిసి ఆయన పాదాలకు నమస్కరించారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కవితకు కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆమె ఆయన చేతికి ప్రేమతో ముద్దు పెట్టారు. జైలు నుండి బయటకొచ్చిన బిడ్డను చూడ‌గానే కేసీఆర్ ముఖంలో ఆనందం క‌నిపించింది. చాలాకాలం తర్వాత ఉత్సాహంతో కేసీఆర్ కనిపించారు. తమ అధినేత సంతోషంలో పార్టీ నాయ‌కులు, సిబ్బంది భాగ‌స్వామ్యం అయ్యారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషం వెల్లివిరిసింది. ప్రస్తుతం కవిత 10 రోజులపాటు కేసీఆర్ తో పాటు ఫామ్ హౌస్ లోనే ఉండనున్నట్లు సమాచారం.

Read Also : Richest Indian : అంబానీని దాటేసిన అదానీ.. శ్రీమంతుల లిస్టులోకి షారుక్‌

  Last Updated: 29 Aug 2024, 02:44 PM IST