Kavitha Special Focus Siddipet : హరీష్ రావు సీటుకే ఎసరు పెట్టిన కవిత..?

Kavitha Special Focus Siddipet : ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం అనగానే హరీష్ రావు దే ఆధిపత్యం

Published By: HashtagU Telugu Desk
Mlc Kavitha Halchal At Sidd

Mlc Kavitha Halchal At Sidd

తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ (BRS) లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) సిద్దిపేట(Siddipet)పై ఎక్కువ దృష్టిపెట్టడం పార్టీ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది. ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం అనగానే హరీష్ రావు దే ఆధిపత్యం. ఆయన బలమైన గ్రిప్పుతో పార్టీని నియోజకవర్గంలో నిలబెట్టారు. అయితే ఇప్పుడు కవిత సిద్దిపేటపై ఆసక్తి చూపించడం, తరచుగా పర్యటనలు నిర్వహించడం హరీష్ రావు అనుచరులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు దారి తీస్తుందా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

Illegal Sand : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సీఎం రేవంత్‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి, విడుదలైన తర్వాత కవిత పార్టీలో తన రాజకీయ ప్రయాణాన్ని కొత్త కోణంలో పునర్నిర్మించుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో వాకౌట్ చేయగా, కవిత మాత్రం సభలో కొనసాగడం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో కవిత పాల్గొనడం, ఆమె తనకు తాను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ అధిష్టానానికి భిన్నమైన రాజకీయ చర్యగా భావిస్తున్నారు.

ఇటీవల కవిత తరచుగా సిద్దిపేటలో పర్యటించడం, హరీష్ రావుకు ప్రత్యామ్నాయంగా తన బలం పెంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే కవిత ఈ వ్యూహాన్ని రూపొందించిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హరీష్ రావు, కవిత బంధువులం అని మాటల్లో చెప్పుకుంటున్నా, మనస్పర్థలు ఉన్నాయనే ప్రచారం గతంలోనూ కొన్ని సందర్భాల్లో జరిగింది. ప్రస్తుతం హరీష్ రావు అధికంగా గడిపే సిద్దిపేటలో కవిత తన రాజకీయ గ్రిప్పును పెంచుకోవాలని భావిస్తున్నట్లు అనిపిస్తోంది.

Mutton: రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే!

కవిత రానున్న ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేస్తారని కొన్ని వర్గాలు చెబుతున్నా, ఆమె సిద్దిపేట నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. హరీష్ రావును రాజకీయంగా నిలువరించాలనే ఉద్దేశంతోనే సిద్దిపేటను తన తదుపరి రాజకీయ అరంగరంగంగా మార్చాలని ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల మదిలో మెదులుతోంది. మరోవైపు, హరీష్ రావు అనుచరులు మాత్రం ఈ పరిణామాలను గమనిస్తూ “ఏం జరుగుతోంది?” అని ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద కవిత తాజా రాజకీయ ఎత్తుగడలు బీఆర్ఎస్‌ లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

  Last Updated: 17 Feb 2025, 04:18 PM IST