Kavitha Release : జైలు నుండి కవిత విడుదల..భావోద్వేగానికి గురవుతూ కన్నీరు

తీహార్ జైలు నుంచి క‌విత మంగ‌ళ‌వారం రాత్రి 9:12 గంట‌ల‌కు విడుద‌లయ్యారు. క‌విత జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే అక్క‌డే ఉన్న త‌న కొడుకును ఆలింగ‌నం చేసుకొని భావోద్వేగానికి లోన‌య్యారు

Published By: HashtagU Telugu Desk
Kavitha Released

Kavitha Released

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam Case)లో అరెస్ట్ అయినా ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఫై విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో ఈడీ అధికారులు కవిత(BRS MLC Kavitha)ను మార్చి 15న అరెస్ట్​ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె తిహాడ్‌ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎంతగానో ట్రై చేసిన కుదరకపోవడం తో సుప్రీం కోర్ట్ (Supreme Court) ను ఆశ్రయించారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్ట్ లో విచారణ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో తీహార్ జైలు నుంచి క‌విత మంగ‌ళ‌వారం రాత్రి 9:12 గంట‌ల‌కు విడుద‌లయ్యారు. క‌విత జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే అక్క‌డే ఉన్న త‌న కొడుకును ఆలింగ‌నం చేసుకొని భావోద్వేగానికి లోన‌య్యారు. ఆ త‌ర్వాత భ‌ర్త అనిల్‌, అన్న‌య్య కేటీఆర్‌ను గుండెల‌కు హ‌త్తుకుని ఆనంద‌భాష్పాలు రాల్చారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకాలం పిల్లల్ని వదిలి ఉండటం అంత సులువైన విషయం కాదని అన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని..బెయిల్ రాకుండా చేసారని..ఎవర్ని వదిలిపెట్టమని ..వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించింది. ‘నేను సాధారణంగా మొండిదాన్ని. ఇంకా నన్ను జగమొండిని చేశారు. ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో కావాలనే ఇబ్బందులు పెట్టారు. మూల్యం చెల్లించి తీరుతా’ అన్నారు.

బుధ‌వారం ట్రయల్‌ కోర్టులో విచారణకు హాజరైన అనంతరం మ‌ధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. క‌విత వెంట ఆమె భ‌ర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావు రానున్నారు. మరోవైపు రేపు ఉద‌యం బీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవ‌కాశం ఉంది.

Read Also : Sajjala Ramakrishna Reddy: నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సజ్జల ఏమన్నారంటే..?

  Last Updated: 27 Aug 2024, 09:43 PM IST