బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)కు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) రాసినట్టు ఒక లేఖ (Letter) ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. “మై డియర్ డాడీ” అంటూ ప్రారంభమైన ఈ లేఖలో.. ఇటీవల జరిగిన పహల్గామ్ అమరులకు నివాళులు అర్పించిన తీరు, బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశాలు కేడర్‌ను ఉత్తేజితులుగా మార్చిన విధానం, పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ వంటి అంశాలు బాగా కలిసొచ్చాయని లేఖలో పేర్కొన్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
Waqf Act : వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయలేం : కేంద్రం
అయితే, ఈ లేఖలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ప్రస్తావించబడ్డట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, వక్స్ బిల్లు వంటి కీలక విషయాలపై మౌనం, బీజేపీపై నిర్ధిష్టంగా విమర్శలు చేయకపోవడం, అలాగే హైదరాబాదులో ఉర్దూలో మాట్లాడకపోవడం వంటి అంశాలు పార్టీకి ప్రతికూలంగా మారినట్లు కవిత వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీ భవిష్యత్ ప్రయాణంలో ఈ తప్పిదాలపై సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించినట్టు తెలుస్తోంది.
ఇకపోతే ఈ లేఖ నిజంగా కవిత రాసిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ లేఖను తయారుచేశారా? అనే విషయంపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. కవిత గానీ, పార్టీ గానీ ఇప్పటి వరకు ఈ లేఖపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరి ఇది ఫేకా..? రియలా అనేది చూడాలి.