Kavitha : ఢిల్లీ లిక్క‌ర్లో `లైగ‌ర్`ఆన‌వాళ్లు? తీహార్ జైలు సంద‌డి!

ల‌య‌న్, టైగ‌ర్ క‌లిపి లైగ‌ర్ (Kavitha) టైటిల్ తో తీసిన సినిమా ఒక విభాగం

  • Written By:
  • Updated On - March 10, 2023 / 07:38 PM IST

ల‌య‌న్, టైగ‌ర్ క‌లిపి లైగ‌ర్ (Kavitha) టైటిల్ తో తీసిన సినిమా ఒక విభాగం `వెల‌మ దందా` ను బ‌య‌ట‌కు తీసింది. ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కొంద‌రు చేసిన మ‌నీలాండరింగ్ వ్య‌వ‌హారాన్ని ఈడీ(ED) ప‌సిగ‌ట్టింది. ఆ మేర‌కు లైగ‌ర్ సినిమా నిర్మాత‌, డైరెక్ట‌ర్లుగా ఉన్న పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మిని విచారించింది. ఆ త‌రువాత తెలంగాణ సీఎం కుమార్తె క‌విత‌ను సీబీఐ విచారించింది. ఇప్పుడు ఈడీ విచారించ‌నుంది. శ‌నివారం రోజు ఆమెను విచారించ‌డానికి ముందుగా `లైగ‌ర్ ` సినిమా లావీదేవీల‌ను ప‌రిశీలిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే, ఆ సినిమా నిర్మాణానికి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ డ‌బ్బును ఉప‌యోగించిన‌ట్టు కాంగ్రెస్ లీడ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ ఈడీకి ఫిర్యాదు చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఈడీ ప‌లు కోణాల నుంచి ఆరా తీస్తోంది.

 లైగ‌ర్  సినిమా మ‌నీలాండరింగ్ వ్య‌వ‌హారాన్ని..(Kavitha)

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లీడ‌ర్ గా ఎమ్మెల్సీ క‌విత (Kavitha) పేరు ప్ర‌ముఖంగా ఉంది. స్కామ్ లోని ప్ర‌ధాన నిందితుడు రామ‌చంద్ర పిళ్లై వాగ్మూలం ప్ర‌కారం ఆయ‌న క‌విత‌కు బినామీ. ఆ మేర‌కు వాగ్మూలం ఇచ్చిన పిళ్లై తాజాగా దాన్ని వెన‌క్కు తీసుకున్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప‌రిశీలించిన కోర్టు ఈడీకి(ED) నోటీసులు జారీ చేసింది. మ‌రో 24 గంట‌ల్లో విచార‌ణ ప్రారంభం కానుండ‌గా లిక్క‌ర్ కేసులో ట్విస్ట్ నెల‌కొంది. న్యాయ‌ప‌రంగా భార‌త దేశంలోనే ప్ర‌ముఖంగా ఉన్న వాళ్ల‌తో బిడ్డ‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Also Read : Kavitha: మోడీ ముందు కవిత కుప్పిగంతులు

చ‌తుర్ముఖ వ్యూహాన్ని ర‌చించిన కేసీఆర్, బిడ్డ క‌విత(Kavitha) జైలుకు వెళ్ల‌కుండా త‌ప్పించాల‌ని స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఇప్ప‌టికే ఆప్ నేత‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను ఈడీ (ED)అరెస్ట్ చేసింది. ఆయ‌న్ను ప‌లుమార్లు విచారించిన త‌రువాత సౌత్ గ్రూప్ త‌ర‌పున రూ. 100కోట్లు చేతులు మారాయ‌ని తేల్చింది. ఆ రూ. 100కోట్లు ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కు వెళ్లాయి? అనే కోణం నుంచి ఈడీ ఆరాతీసింది. ఆ క్ర‌మంలో లైగ‌ర్ సినిమా వ‌ద్ద విచార‌ణ ఆగిన‌ట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో విల‌న్ గా న‌టించిన టైస‌న్ కు భారీగా చెల్లించారు. ముంబాయ్ కేంద్రంగా లైగ‌ర్ సినిమా ఆఫీస్ న‌డిచింది. ప్ర‌స్తుతం అక్క‌డ ఆఫీస్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆ అడ్ర‌స్ తో న‌డిచిన లావాదేవీల‌ను ఈడీ అధ్య‌య‌నం చేస్తోంది.

ఢిల్లీ వెళుతున్న‌ప్పుడు అతి సామాన్యురాలిగా క‌విత 

సాధార‌ణంగా ఖ‌రీదైన వాచ్‌, బంగారు ఆభ‌ర‌ణాలు, ల‌క్ష‌ల విలువ చేసే చీర‌ల‌ను మార్చేసే క‌విత(Kavitha) ఢిల్లీ వెళుతున్న‌ప్పుడు అతి సామాన్యురాలిగా బ‌య‌లుదేరారు. ఆ విష‌యం పార్టీలోని అంత‌ర్గ‌త వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అంటే, ఈడీ (ED) అరెస్ట్ కు మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతూ ఆమె ఢిల్లీ వెళ్లార‌ని పార్టీ వ‌ర్గాల్లోని కొంద‌రి వినికిడి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ఆమె ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన జ‌డ్స‌న్ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు రాత‌పూర్వ‌క ఫిర్యాదులు అనేకం చేశారు. ఒకానొక సంద‌ర్భంలో ఆమె ఆస్తుల చిట్టాను బ‌య‌ట‌కు తీస్తూ ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా ఆమె అమెరికా వెళ్లింద‌ని కూడా ఆయ‌న మీడియాకు ఎక్కారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ, బీఆర్ఎస్ స‌ఖ్య‌త‌గా ఉండ‌డంతో ఏమి చేసినా స‌రిపోయింద‌ని జ‌డ్స‌న్ అభిప్రాయం. కానీ, ఇప్పుడు ఆ రెండు పార్టీల మ‌ధ్య తేడా వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ పూర్తిగా న‌మ్మ‌లేమ‌ని కాంగ్రెస్ చెబుతోంది.

`వెల‌మ‌` పెద్ద‌లు చేసిన దందాల‌ను జ‌డ్స‌న్ బ‌య‌ట‌కు తీస్తున్నారు

ఒక వేళ క‌విత‌ను ఈడీ(ED) శ‌నివారం రోజు అరెస్ట్ చేయ‌కుండా వ‌దిలేస్తే, ఢిల్లీ స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఉన్న బంధాన్ని కాంగ్రెస్ బ‌య‌ట‌కు తీయ‌నుంది. అందుకే, ఈడీ విచార‌ణ రాజ‌కీయంగానూ తెలంగాణ వ్యాప్తంగా కీల‌కం కానుంది. లైగ‌ర్ సినిమాతో పాటు కొంద‌రు `వెల‌మ‌` పెద్ద‌లు చేసిన దందాల‌ను జ‌డ్స‌న్ బ‌య‌ట‌కు తీస్తున్నారు. డ్ర‌గ్స్, రియ‌ల్ ఎస్టేట్, విద్య‌, వైద్యం, మీడియా, ఫార్మా రంగాల్లోని కొంద‌రు క‌లిసి తెలంగాణ వ్యాప్తంగా చేస్తోన్న వ్య‌వ‌హారాల‌పై ఇప్ప‌టికే ప‌లు ఫిర్యాదులు ఆయ‌న చేశారు. ఇప్పుడు క‌విత (Kavitha) అరెస్ట్ అయితే, మిగిలిన అంశాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ప్ర‌త్య‌ర్థులు ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో రామ‌చంద్ర పిళ్లై త‌న వాగ్మూలాన్ని వెన‌క్కు తీసుకుంటూ పిటిష‌న్ వేయ‌డంతో క‌విత కేసు మ‌లుపు తిరుగుతోంది. అయితే, లైగ‌ర్ సినిమా లావాదేవీలు ఆధారంగా మ‌రో విచార‌ణ కూడా ఉండే అవకాశం ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. మొత్తం మీద మ‌రో 24 గంట‌ల్లో క‌విత భ‌విష్య‌త్ తీహార్ జైలా? లేదా హైద‌రాబాద్ కా ? అనేది తేల‌నుంది.

Also Read : BRS Kavitha :ఆర్థిక పాపం పండింది!ED బేడీల వేళ నారీభేరీ!