బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తాజాగా ఓ పాడ్కాస్ట్‌లో పాల్గొని వివిధ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కేసీఆర్ తనకు ఆచరణాత్మక నేతగా ఎంతో ఇష్టమని తెలిపిన కవిత, కాంగ్రెస్ నేతల్లో సోనియా గాంధీ, సిద్ధరామయ్యలపై ప్రత్యేక అభిమానమున్నట్టు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ఎంతో ధైర్యంగా, నిజాయితీగా సవాళ్లను స్వీకరించే నేతగా అభివర్ణించారు. అలాగే నారా లోకేశ్ రాజకీయంగా మెచ్యూరిటీ చూపిస్తున్నారని, ఆయన ఆప్యాయత తనకు నచ్చిందని చెప్పారు. బీజేపీలో మరణించిన సుష్మా స్వరాజ్‌నే తనకు ఇష్టమైన నాయకురాలిగా పేర్కొన్నారు.
Akhanda 2 : బాలకృష్ణ- బోయపాటి మధ్య విభేదాలా..? అఖండ 2 ఆగిపోయిందా..? క్లారిటీ ఇదే !
అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన రాజకీయాల్లో నాటకీయత ఎక్కువగా చూపుతున్నారని, సీరియస్ లీడర్ కాదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి గెలవడాన్ని కూడా సెటైరిక్‌గా విపరీతంగా వ్యాఖ్యానించిన కవిత, ఆయన ఇటీవల హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. పవన్ మాట్లాడుతూ ఒక్కసారి చెగువేరా అభిమానిగా కనిపిస్తారని, మరోసారి బీజేపీతో కలిసి కూటమి పెట్టిన రైటిస్టుగా మారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై జనసైనికుల నుంచి తీవ్ర ప్రతిస్పందన వెలువడుతోంది. కవిత లిక్కర్ స్కామ్‌లో జైలు పాలైన వ్యక్తి అని, ఆమెకు నీతులు చెప్పే అర్హత లేదంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో రియాక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆమె పవన్ పై విరుచుకుపడిన విధానం, ప్రత్యేకించి తమిళనాడుకు వెళ్లి హిందీ అమలు చేస్తానని చెప్పవచ్చన్న సెటైర్లు, ట్రెండింగ్‌గా మారాయి. మొత్తం మీద, కవిత వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెంచాయి.