Site icon HashtagU Telugu

Kavitha vs KCR : ‘కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ‘ ఉన్నాయి – కవిత

Kavitha Claty

Kavitha Claty

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) రాసిన లేఖ పెద్ద సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో ఆమె నిజంగా ఆ లేఖ (Letter) రాసిందా…? ఆ లేఖ ఎందుకు రాసినట్లు..? కుటుంబంలో ఏమైనా విభేదాలు మొదలయ్యాయా..? కేటీఆర్ – కవిత కు పడడం లేదా..? ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో దీనిపై కవిత క్లారిటీ ఇచ్చారు. రెండు వారాల క్రితం తనే స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశానని ఆమె వెల్లడించారు. పార్టీలో అసలేం జరుగుతోందో తెలుసుకోవాలని ఆ లేఖలో కోరినట్లు చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ..”నాకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. కానీ నేను రాసిన లేఖ బయటకు రావడం వెనుక ఒక కుట్ర ఉంది. కేసీఆర్ గారు నాకు దేవుడిలాంటివారు. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Hanuman Pooja: ఎలాంటి పనులు చేసిన ఆటంకాలు ఎదురవుతున్నాయా.. అయితే ఆంజనేయస్వామిని ఇలా పూజించాల్సిందే!

ఇదిలా ఉంటె..కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “సామాజిక తెలంగాణ సాధన సమితి” పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం పుకార్లేనా? లేదా నిజంగానే కవిత కొత్త రాజకీయ ప్రయాణం మొదలుపెడతారా? అన్నది సమయం చెప్పాల్సిన విషయం.

ఇక కవిత వర్గానికి చెందిన నాయకులు ఆమెకు బలంగా మద్దతు తెలుపుతున్నారు. “సామాజిక తెలంగాణ సాధన లక్ష్యం కోసం పనిచేస్తున్న కవితక్కకి స్వాగతం” అంటూ ఫ్లెక్సీలు వేయడం గమనార్హం. ఇవన్నీ చూస్తే బీఆర్‌ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్టు స్పష్టమవుతోంది. కేసీఆర్ కుటుంబంలో రాజకీయ సమీకరణాలు మారుతాయా? కవిత వేరు రాజకీయం ప్రారంభిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.