Kavitha BRS : డాట‌ర్ ఆఫ్ పైట‌ర్ గ్రాఫ్ పైపైకి! బీజేపీ ఢ‌మాల్‌!

తెలంగాణ బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతుందా? క‌వితను(Kavitha BRS)  కేంద్రం వేధించిందా?

  • Written By:
  • Updated On - March 23, 2023 / 12:49 PM IST

తెలంగాణ బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతుందా? క‌వితను(Kavitha BRS)  కేంద్రం వేధించిందా? ఏమీ లేకుండానే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్(Delhi liquor scam) ను క‌విత‌కు బీజేపీ అంటించిందా? కేసీఆర్ స‌వాళ్ల‌తో మోడీ, అమిత్ షా తోక‌ముడిచారా? అరెస్ట్ అంటూ క‌విత మీద దుమ్మెత్తిపోసిన బీజేపీకి తెలంగాణ‌లో కౌంట్ డౌన్ ప్రారంభం అయిన‌ట్టేనా? అంటే ఔను అనే వాళ్లు గ‌త రెండు రోజులుగా పెరిగారు. కార‌ణం ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారులు వేధించార‌ని తెలంగాణ స‌మాజం ఇప్పుడు న‌మ్మే ప‌రిస్థితి వ‌చ్చింది. `ఏమీ కాదు, ధైర్యంగా పోయిరమ్మ‌ని` కేసీఆర్ తొలి రోజే క‌విత‌కు చెప్పి పంపారు. ఆ త‌రువాత రామ‌చంద్ర పిళ్లై వాగ్మూలం వెన‌క్కు తీసుకోవ‌డం, ఈడీ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాజీనామా జ‌రిగిపోయ‌ని విష‌యం అందరికీ తెలిసిందే.

  క‌వితను   కేంద్రం వేధించిందా?(Kavitha BRS)

వాస్త‌వంగా లిక్క‌ర్ లిక్క‌ర్ స్కామ్ (Delhi liquor scam) గ‌త ఏడాది ఢిల్లీ బీజేపీ లీడ‌ర్లు బ‌య‌ట‌పెట్టారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోల‌ను, ఆడియోల‌ను సోష‌ల్ మీడియాలో ఉంచారు. ఆ రోజు నుంచి క‌విత(Kavitha BRS)  అరెస్ట్ ను నిర్థారిస్తూ బీజేపీ నేత‌లు మాట్లాడారు. తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు, లిక్క‌ర్ స్కామ్ కొన్ని నెల‌ల పాటు స‌మాంత‌రంగా న‌డిచాయి. బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ సిట్ ప‌నిచేసింది. అదే క్ర‌మంలో లిక్క‌ర్ స్కామ్ ను ఢిల్లీ వేదికగా బ‌య‌ట‌కు తీశారు. ఆ రోజే కేసు కు కేసు చెల్లు అనే ప‌ద్ద‌తి ఉంటుంద‌ని తెలుగు ప్ర‌జ‌లు చాలా మంది అనుకున్నారు. గ‌తంలోనూ ఓటుకు నోటు, ఫోన్ల ట్యాంపరింగ్ కేసులు చంద్ర‌బాబు, కేసీఆర్ మ‌ధ్య న‌డిచిన విష‌యం విదిత‌మే. ఆ త‌రువాత ఆ కేసులు ఎక్క‌డ ఉన్నాయో కూడా తెలియ‌కుండా చేయ‌గ‌లిగారు. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, లిక్క‌ర్ కేసు చెల్లుకు చెల్లు అన్న‌ట్టుగా మారింది.

కేసు కు కేసు చెల్లు అనే ప‌ద్ద‌తి

ఈనెల 24న సుప్రీం కోర్టులో క‌విత (Kavitha BRS) విచార‌ణ తీరు మీద సుప్రీం కోర్టులో పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది. ఆ రోజు ఈడీ వినిపించే వాద‌న‌ల మేర‌కు క‌విత శాశ్వ‌తంగా సేఫ్ జోన్లో ఉన్న‌ట్టా? లేక ఇంకా వేధింపులు ఉంటాయా? అనేది తేల‌నుంది. సుప్రీం కోర్టు ఇచ్చే డైరెక్ష‌న్ ఆధారంగా కేసు తీవ్ర‌త‌ను అంచ‌నా వేయ‌డానికి అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం క‌విత‌ను ఢిల్లీ వేదిక‌గా ఈడీ(Delhi liquor scam) వేధించిన‌ట్టే ఎమ్మెల్మేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు విచార‌ణ చేశారు. నిందితుల‌ను ముగ్గుర్నిని జైలుకు పంపారు. ఆ త‌రువాత నిందితులు బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ, కీల‌క సూత్ర‌ధారిగా ఉన్న బీఎల్ సంతోష్ విష‌యంలో సిట్ ఏమీ చేయ‌లేక‌పోయింది. న్యాయ‌స్థానాల ద్వారా బీఎల్ సంతోష్ ఉప‌శ‌మ‌నం పొందారు. సేమ్ టూ సేమ్ క‌విత కూడా న్యాయ‌స్థానాల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతార‌ని రాజ‌కీయ నిపుణుల అంచ‌నా. ఫ‌లితంగా కేసుకు కేసుకు చెల్లుతో ఎన్నిక‌ల గోదాలోకి బీజేపీ, బీఆర్ఎస్ దిగ‌బోతున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Kavitha @ED: మూడోసారీ నో అరెస్ట్, కవిత హ్యాపీగా బయటకు..

తెలంగాణ బీజేపీ ఆరోప‌ణ‌లు, హడావుడి క‌విత (Kavitha BRS) రాజ‌కీయ గ్రాఫ్ ను అమాంతం పెంచాయి. ఆమెకు అనూహ్యంగా దేశ వ్యాప్తంగా ప్ర‌చారం ల‌భించింది. అంతేకాదు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ మాటలు కూడా క‌విత‌కు బాగా సానుకూలంగా మారాయ‌ని మ‌హిళ‌ల్లోని అభిప్రాయం. ఈడీ అరెస్ట్ చేయ‌క ముద్దు పెట్టుకుంటుందా? అంటూ బండి చేసిన కామెంట్స్ దుమారం రేగాయి. ఆయ‌న తెలంగాణ మ‌హిళ క‌మిష‌న్ ఎదుట సంజాయిషీ చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక క‌విత‌ను మూడుసార్లు విచారించిన‌ప్ప‌టికీ ఈడీ (Delhi liquor scam) ఎలాంటి ఆధారాలు రాబ‌ట్ట‌లేక‌పోయింద‌ని బీఆర్ఎస్ చెబుతోంది. అంతిమంగా ధ‌ర్మ‌మే గెలుస్తుంద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు క‌విత‌ను విచారించ‌డాన్ని చూస్తే ఒక మ‌హిళ‌ను ఈడీ వేధించిన తీరు తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌ది ఫోన్ల‌ను ధ్వంసం చేశార‌ని క‌విత మీద ఈడీ ఆరోపించింది. కానీ, మూడోసారి విచార‌ణ‌కు వెళ్లిన సంద‌ర్భంగా ఆమె వాడిన ఫోన్ల‌ను మీడియాకు ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా నిజాయితీని వెల్ల‌డించారు.

Also Read : BRS : బీజేపీ ప్ర‌త్యామ్నాయంపై నార్త్-సౌత్‌,KCR అయోమ‌యం!

ఎమ్మెల్సీ క‌విత (Kavitha BRS) విష‌యంలో జ‌రిగిన ఈడీ విచార‌ణ ఎపిసోడ్ ఆమెకు రాజ‌కీయంగా ఎంతో మేలు చేసిన‌ట్టు ఉంది. ఒక మహిళ ఈడీ ఎదుట డేర్ గా నిల‌వ‌డం దేశ వ్యాప్తంగా చూశారు. `ఫైట‌ర్ డాట‌ర్` అంటూ హోర్డింగులు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తాయి. మీడియాలో గ‌త నెల రోజుల పాటు ఫుల్ క‌వ‌రేజి, బీజేపీ నేత‌ల నిరాధార ఆరోప‌ణ‌లు వెర‌సి బీఆర్ఎస్ పార్టీకి అందొచ్చిన అంశాలు. ఈడీ విచార‌ణ కాదు మోడీ విచార‌ణ అంటూ బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేసింది. మూడుసార్లు విచార‌ణ ముగిసిన త‌రువాత క‌విత విక్ట‌రీ సింబ‌ల్ తో ఈడీ (Delhi liquor scam) ఆఫీస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం బీజేపీ తెలంగాణ లీడ‌ర్ల‌కు చెంప‌పెట్టు.

తెలంగాణ సిట్‌, ఈడీ విచార‌ణ‌లు ఇక అట‌కెక్కిన‌ట్టే

ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన త‌రువాత ప్ర‌గ‌తిభ‌వ‌న్లో క‌ల్వ‌కుంట్ల కుటుంబం స‌మావేశం అయింది. ఇక ఢిల్లీ లిక్క‌ర్ (Delhi liquor scam) కేసు వీగిపోయింద‌ని భావిస్తూ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌, రాష్ట్రాల్లో బ‌హిరంగ స‌భ‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. మొత్తం మీద తెలంగాణ సిట్‌, ఈడీ విచార‌ణ‌లు ఇక అట‌కెక్కిన‌ట్టే రాజ‌కీయ అనుభ‌వ‌జ్ఞులు భావిస్తున్నారు. మూడోసారి కూడా కేసీఆర్ సీఎం కావ‌డానికి అనువైన ప‌రిస్థితుల‌ను ఈడీ ద్వారా బీజేపీ తీసుకొచ్చింద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి అంచ‌నా లేకుండానే మోడీ, షా ద్వ‌యం ఈడీ రూపంలో ముందుకు దూకిందా? అంటే న‌మ్మ‌లేం. కానీ, కేసీఆర్ వ్యూహాలు, చ‌తుర‌త‌కు మాత్రం బీజేపీ వెన‌క్కు త‌గ్గింద‌ని చెప్ప‌డానికి ఏ మాత్రం సందేహం లేదు.

Also Read : KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..